అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సేవలు | Amazon Diagnostics Brings At Home Lab Testing to Indian Metros | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ సేవలు

Jun 23 2025 9:02 AM | Updated on Jun 23 2025 9:10 AM

Amazon Diagnostics Brings At Home Lab Testing to Indian Metros

అమెజాన్‌ ఇండియా డయాగ్నోస్టిక్స్‌ సేవలను ప్రారంభించింది. ఇంటి నుంచే కస్టమర్లు ‘అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌’ ద్వారా తమకు కావాల్సిన ల్యాబ్‌ టెస్ట్‌లను బుక్‌ చేసుకోవచ్చని, డిజిటల్‌ రిపోర్ట్‌లను అమెజాన్‌ యాప్‌ నుంచి పొందొచ్చని ప్రకటించింది. ఆరంజ్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ సహకారంతో ఈ సేవలను తొలుత హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై పరిధిలో 450 పిన్‌కోడ్‌ల వ్యాప్తంగా అందిస్తున్నట్టు తెలిపింది.

ఇదీ చదవండి: స్టార్‌ రేటింగ్‌ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?

వినియోగదారులు నేరుగా అమెజాన్ యాప్ ద్వారా పరీక్షలను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన 60 నిమిషాల్లో సదరు మెడికల్‌ సిబ్బంది ఇంటికి వచ్చి టెస్టింగ్‌ కోసం శాంపిల్స్‌ సేకరించుకుంటారు. నమూనాలు సేకరించిన తర్వాత గరిష్టంగా 6 గంటల్లో ఫలితాలకు సంబంధించిన డిజిటల్ ల్యాబ్ రిపోర్టులుగా అందజేస్తారు. మొత్తం 800 వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆఫర్‌ చేస్తున్నట్టు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. దీంతో కలిపి ప్రస్తుత ఫార్మసీ, క్లినిక్‌ సేవలను అమెజాన్‌ మెడికల్‌తో అనుసంధానించింది.

Advertisement
 
Advertisement
Advertisement