లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Stock Market Rally Today Closing On 29 October 2024 | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Oct 29 2024 4:17 PM | Updated on Oct 29 2024 4:23 PM

Stock Market Rally Today Closing On 29 October 2024

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 24,466 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 363 పాయింట్లు ఎగబాకి 80,369 వద్ద ముగిసింది.

వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు గడిచిన రెండు సెషన్లలో లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌ ఈరోజు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్‌లు నష్టాల్లో ముగిసాయి. బారీగా పడిన మార్కెట్లు కొంత ఆకర్షణీయంగా మారడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడి పెడుతున్నట్లు తెలిసింది. రానున్న యూఎస్‌ ఎన్నికలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: గూగుల్‌ ‘షాడో క్యాంపెయిన్‌’!

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement