అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లను దాటేసిన స్పేస్‌ఎక్స్‌  | SpaceX Rally Pushes It Past Amazon in Market Value | Sakshi
Sakshi News home page

అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లను దాటేసిన స్పేస్‌ఎక్స్‌ 

Jun 17 2026 1:53 AM | Updated on Jun 17 2026 1:53 AM

SpaceX Rally Pushes It Past Amazon in Market Value

3 ట్రిలియన్‌ డాలర్లకు చేరువలో మార్కెట్‌ విలువ

1.3 ట్రిలియన్‌ డాలర్లకు మస్క్‌ వెల్త్‌

న్యూయార్క్‌: ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ షేరు వాల్‌స్ట్రీట్‌లో రోజుకో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. అమెరికా నాస్‌డాక్‌ ఎక్సే్చంజీలో మంగళవారం ఇంట్రాడేలో ఈ షేరు ఏకంగా 17 శాతానికి పైగా లాభపడి 226 డాలర్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. షేరు భారీ ర్యాలీతో స్పేస్‌ఎక్స్‌ సంస్థ మార్కెట్‌ విలువ 2.95 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. 

ఈ క్రమంలో 2.64 ట్రిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఈ–కామర్స్‌ దిగ్గజ సంస్థ ‘అమెజాన్‌’ను వెనక్కి నెట్టింది. అలాగే, ఒక దశలో 2.92 ట్రిలియన్‌ డాలర్ల విలువ గల ‘మైక్రోసాఫ్ట్‌’ను సైతం అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్‌–5 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక ఎలాన్‌ మస్క్‌ సంపద కూడా రాకెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. స్పేస్‌ఎక్స్‌ లిస్టింగ్‌తో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించిన ఎలాన్‌ వెల్త్‌ తాజాగా 1.3 ట్రిలియన్‌ డాలర్లకు ఎగబాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement