Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

29 People Died Consuming Illicit Liquor In Tamil Nadu Kallakurichi
తమిళనాడు కల్తీ సారా ఘటన: 35కి చేరిన మృతుల సంఖ్య.. సీఎం స్టాలిన్‌ సీరియస్‌

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 35కి చేరుకుంది. ఈ ఘటనలో మరో 25 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇక, ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సీరియస్‌ అయ్యారు. సీఎం స్టాలిన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్‌ చేశారు. Tamil Nadu CM tweets, "I was shocked and saddened to hear the news of the deaths of people who had consumed adulterated liquor in Kallakurichi. Those involved in the crime have been arrested in this matter. Action has also been taken against the officials who failed to prevent…— ANI (@ANI) June 19, 2024 మరోవైపు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్‌ మీనాపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అలాగే కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్‌, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. ఇదిలా ఉండగా.. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్‌ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. #WATCH | Tamil Nadu: At least 25 people died and several were hospitalised after reportedly consuming illicit liquor in Tamil Nadu's Kallakurichi district: District Collector MS Prasanth(Visuals from Kallakurichi Government Medical College) pic.twitter.com/WI585Cbxbk— ANI (@ANI) June 19, 2024 ఇక, ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 40 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రికి తరలించారు. VIDEO | #TamilNadu: Several people were reported dead, and many others hospitalised after consuming spurious liquor in #Kallakurichi district.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/IFicB26zG0— Press Trust of India (@PTI_News) June 20, 2024

YS Jagan direction to MLAs and contested candidates
నేడు వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 20న గురువారం తాడేపల్లిలో నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభం అవుతుంది.

After 101 metre six, Brandon King forced off the field due to injury
రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్‌.. స్టేడియం బయటకు బంతి! వీడియో

టీ20 వరల్డ్‌కప్‌-2024లో సెయింట్‌ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓపెనర్‌ బ్రాండెన్‌ కింగ్‌ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో కింగ్‌ భారీ సిక్స్‌ కొట్టాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 101 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది. విండీస్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ రీస్‌ టాప్లీ తొలి రెండు బంతులను డాట్‌లగా వేశాడు. అనంతరం మూడో బంతిని స్టంప్స్‌ లైన్‌ దిశగా ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. బంతి స్లాట్‌లో ఉండడంతో కింగ్‌ మిడ్ వికెట్ మీదగా భారీ సిక్స్‌ బాదాడు. దెబ్బకు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రోహిత్‌ కూడా అచ్చెం ఈ విధంగానే మిడ్‌ వికెట్‌ దిశగా ఈజీగా భారీ సిక్స్‌లు కొడుతుంటాడు. ఇక ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన కింగ్‌ దురదృష్టవశాత్తు రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. View this post on Instagram A post shared by ICC (@icc)

 Friday OTT Release Movies Telugu June 21st 2024
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్

వీకెండ్ వచ్చేసింది. వచ్చే వారం 'కల్కి' రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ వీకెండ్ చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. హనీమూన్ ఎక్స్‌ప్రెస్, నింద, ఓ మంచి ఘోస్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంతిమ తీర్పు, సందేశం, మరణం, పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా, సీతా కళ్యాణ వైభోగమే, మరణం సై అంటే సై సినిమాలతో పాటు ఉపేంద్ర ఏ, ప్రేమ కథా చిత్రమ్, కేజీఎఫ్ 1 చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?)మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్ వీకెండ్‌లో 17 చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో బాక్, నడిగర్ తిలగం, రసవతి మూవీస్.. ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు లిస్ట్ ఏంటి? ఏవి ఎందులోకి రానున్నాయనేది చూద్దాం.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా (జూన్ 21)నెట్‍‌ఫ్లిక్స్నడికర్ తిలగం - తెలుగు డబ్బింగ్ సినిమాద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 - మాండరిన్ సిరీస్గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా - స్పానిష్ సిరీస్ట్రిగ్గర్ వార్నింగ్ - ఇంగ్లీష్ మూవీకోటా ఫ్యాక్టరీ సీజన్ 3 - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)అమెరికన్ స్వీట్ హార్ట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ద యాక్సిడెంటల్ ట్విన్స్ - స్పానిష్ మూవీ (స్ట్రీమింగ్)రైజింగ్ ఇంపాక్ట్ - జపనీస్ సిరీస్ (జూన్ 22)హాట్‌స్టార్బాక్ - తెలుగు డబ్బింగ్ మూవీమై నేమ్ ఈజ్ గాబ్రియోల్ - కొరియన్ సిరీస్బ్యాడ్ కాప్ - హిందీ సిరీస్ద బేర్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఆహారసవతి - తమిళ మూవీజియో సినిమాబిగ్ బాస్ ఓటీటీ - హిందీ రియాలిటీ షోఅమెజాన్ ప్రైమ్లెస్ ఇన్ఫైలబుల్స్ - ఫ్రెంచ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)ఫెదరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్ - ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)బుక్ మై షోలాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ - ఇటాలియన్ మూవీ(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె)

Education Ministry orders cancellation of UGC-NET
యూజీసీ–నెట్‌ రద్దు

న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్‌ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్‌ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్‌ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్‌(ఓఎంఆర్‌) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్‌ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్‌ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ నెట్‌ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్‌ జూన్‌ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్‌ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్‌ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. నెట్‌ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్‌ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐ4సీలోని నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ థ్రెట్‌ అనలైటిక్స్‌ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్‌ను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీయే ఈ నెట్‌ పరీక్షనూ చేపట్టింది. యూజీసీ–నెట్‌ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌– నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌( యూజీసీ–నెట్‌) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరొచ్చు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా చేరొచ్చు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్‌డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్‌ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు.

Daily Horoscope June 20 2024 Telugu
జూన్‌ 20 నేటి దినఫలం.. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం

మేషం: ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.వృషభం: గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయ ప్రయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.మిథునం: కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.కర్కాటకం: శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. అద్భుతమైన అవకాశాలను పొందుతారు.సింహం: స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. దైవదర్శనం చేసుకుంటారు. కన్య: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.తుల: నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.వృశ్చికం: మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ధనుస్సు: విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి.మకరం: ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబకలహాలు దూరమవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.కుంభం: నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.మీనం: ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.

International Driving Permit is in demand every year
విదేశాల్లో.. రయ్ .. రయ్

ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌(ఐడీపీ)లకు ఏటేటా డిమాండ్‌ పెరుగుతోంది. ఉన్నత చదువులు..ఉద్యోగాలు..టూరిస్ట్‌ వీసాలపై విదేశాలకు వెళ్లేవారు ఐడీపీ కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు వెళ్లిన నగరవాసుల్లో ఈ ఏడాది 42,471 మంది ఐడీపీ తీసుకున్నారు. – సాక్షి, హైదరాబాద్‌అమెరికాకే ఎక్కువగా.. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఏటా లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్నారు. వారే పెద్దసంఖ్యలో ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ తీసుకుంటున్నారు. అమెరికాతోపాటు అన్ని దేశాల్లోనూ మన డ్రైవింగ్‌ లైసెన్సులను అనుమతించడం వల్ల డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో నగరవాసులు తీసుకొనే ఐడీపీలో 60 % వరకు అమెరికాలో డ్రైవింగ్‌ కోసమే కావడం గమనార్హం. హెచ్‌ 4 వీసాపై డిపెండెంట్‌గా వెళుతున్న మహిళలు అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగాన్వేషణలో భాగంగా డ్రైవింగ్‌ తప్పనిసరిగా భావిస్తున్నారు. అలా ఐడీపీలు తీసుకుంటున్న మహిళల సంఖ్య కూడా ఏటా పెరు గుతూనే ఉంది. ‘హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్‌ వస్తే చాలు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరుగులు తీయొచ్చు. అందుకే ఎక్కువ మంది ఐడీపీల కోసం వస్తారు.’అని ఆర్టీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అమెరికా తర్వాత మలేసియా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, స్వీడన్, సింగపూర్, హాంకాంగ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఫిన్‌లాండ్, ఇటలీ, మారిషస్, ఐర్లాండ్‌ తదితర దేశాల్లో ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌లను అనుమతిస్తున్నారు. » అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో ఏడాదిపాటు అనుమతిస్తుండగా, యూరోప్‌ దేశాల్లో 6 నెలల వరకు మాత్రమే అనుమతి ఉంది.» ఐడీపీపై మలేసియాలో బండి నడపాలంటే ఆ దేశ అధికార భాష మలేలోకి ఐడీపీ వివరాలు నమోదు చేసుకోవాలి. భారత రాయబార కార్యాలయం నుంచి ఈ సదుపాయం లభిస్తుంది. » ఫ్రాన్స్‌లోనూ ఐడీపీని ఫ్రెంచిలోకి తర్జుమా చేసుకోవడం తప్పనిసరి. » ఆ్రస్టేలియాలో మూడు నెలల వరకే అనుమతి ఉంటుంది. » కెనడాలో మూడు నెలల్లోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవాలి. ఐడీపీ ఈజీనే... » అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ తీసుకోవడం ఎంతో తేలిక. నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్ప ల్, మెహదీపట్నం, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మలక్‌పేట్, కూకట్‌పల్లి, బండ్లగూడ, తదితర ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఐడీపీ తీసుకోవచ్చు. పాస్‌పోర్టు, వీసాతో పాటు, పర్మనెంట్‌ లైసెన్సు డాక్యుమెంట్‌లను అందజేసి రూ.1500 ఫీజు చెల్లించాలి. సాధారణంగా అన్ని రకాల ఆర్టీఏ సేవలు ఆన్‌లైన్‌లో లభిస్తుండగా, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ మాత్రం అధికారులు నేరుగా దరఖాస్తుదారులకే అందజేస్తారు. స్పెయిన్‌లో డ్రైవింగ్‌ చేశా.. విదేశాలకు ఎక్కువగా వెళతాను. అక్కడికి వెళ్లిన తర్వాత బంధువులు, స్నేహితుల వాహనాలు అందుబాటులో ఉంటాయి. కానీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో హైదరాబాద్‌ నుంచి ఐడీపీతో వెళితే ఆ ఇబ్బంది ఉండదు. స్పెయిన్‌లో మూడు నెలలు ఐడీపీతోనే డ్రైవింగ్‌ చేశాను. – సుబ్బారెడ్డి, టూరిస్టు థాయ్‌లాండ్‌లో రైట్‌ డ్రైవింగే డాక్యుమెంటరీల షూటింగ్‌కు తరచుగా విదేశాలకు వెళతా. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఓ డాక్యుమెంటరీ షూటింగ్‌ సందర్భంగా ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌తో వెళ్లాను. అక్కడ మన ఇండియాలోలాగే రైట్‌ డ్రైవింగ్‌. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కారులో అన్ని చోట్లకు వెళ్లాను. – మిద్దె బాలరాజు, ఆర్టిస్ట్‌ జర్మనీలో నిబంధనలు కఠినం.. జర్మనీలో మన ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌లపై బండి నడపడం చాలా కష్టం. మన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను వారు పరిగణనలోకి తీసుకోలేదు. స్టూడెంట్‌గా వెళ్లాను. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ జర్మనీలోనే ఉంటున్నారు. మొదట్లో హైదరాబాద్‌ నుంచి ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ తీసుకొని వెళ్లగా, 6 నెలలు మాత్రమే అనుమతించారు. ఉద్యోగరీత్యా అక్కడే ఉండాల్సి రావడంతో అక్కడి నిబంధనల మేరకు మొదట లెర్నింగ్, ఆ తర్వాత పర్మనెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నా. జర్మనీలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. – తన్యా కొండ

Deferents Between Chandrababu And YS Jagan Focus On Polavaram
జీవనాడిపై దాడి!

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి. గరిష్టంగా 194.6 టీఎంసీల సామర్థ్యంతో గోదావరిపై నిర్మిస్తున్న అతి పెద్ద జలాశయం ఇదే. కుడి, ఎడమ కాలువ ద్వారా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించ వచ్చు. విశాఖ నగరం పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ప్రాజెక్టులో నిర్మించే జలవిద్యుత్కేంద్రంలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. పోలవరం పూర్తయితే రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోవడం ఖాయం. దేశంలో ఈ స్థాయిలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు అవసరాలను తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు మరొకటి లేదు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించిన పోలవరాన్ని విభజన నేపథ్యంలో 2014లో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తామే వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబరు 7న అధికారంలో ఉండగా చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని నమ్మబలికి కేంద్రానికి హామీ ఇచ్చారు. 2014 ఏప్రిల్‌ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం తెగేసి చెబితే దానికీ చంద్రబాబు తలూపారు. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఖరారు చేసిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను కమీషన్ల దాహంతో తుంగలో తొక్కి పనులు చేపట్టారు. వరదను మళ్లిం­చేలా స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించారు. చివరకు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయలేక ఇరువైఫులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ఈ నిర్వాకాల కారణంగా 2019 జూన్‌ తర్వాత గోదావరిలో పోటెత్తిన భారీ వరద కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీల మీదుగా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే పోలవరం పనులను అత్యంత సంక్లిష్టంగా మార్చింది. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ల పనులను చంద్రబాబు గాలికొదిలేసి డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించడమే ఈ క్లిష్ట పరిస్థితికి మూల కారణం. జీవం తీసిన వారే బురద జల్లుతున్నారు తాజాగా పోలవరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు జీవనాడి లాంటి ప్రాజెక్టును వైఎస్‌ జగన్‌ విధ్వంసం చేశారంటూ నిస్సిగ్గుగా బుకాయించారు. కమీషన్లకు ఆశపడి పోలవరం జీవం తీసిన చంద్రబాబు దీన్ని కప్పిపుచ్చి జీవం పోసిన వైఎస్‌ జగన్‌పై బురద జల్లే యత్నం చేయడాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.అక్రమాలు అరికట్టి కీలక పనులు పూర్తి.. 2019 మే 30న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ సర్కార్‌ చేసిన చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టారు. పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతర్‌ చేస్తూ రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు నాడు చంద్రబాబు సర్కార్‌ నామినేషన్‌పై కట్టబెట్టింది. వీటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా రూ.783 కోట్లను ఖజానాకు వైఎస్‌ జగన్‌ ఆదా చేశారు. రాత్రిపూట కాఫర్‌ డ్యామ్‌ పనులు చేస్తున్న దృశ్యం (ఫైల్‌) నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ స్పిల్‌వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్‌ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీస్‌ను పూర్తి చేశారు. ఎడమ కాలువలో వరాహ నదిపై అత్యంత పొడవైన అక్విడెక్టుతోసహా కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. జలవిద్యుత్కేంద్రం పనులను సైతం కొలిక్కి తెచ్చారు. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. ఇక డయాఫ్రమ్‌వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే 18 నెలల్లోగా ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని 2022 డిసెంబర్‌ నుంచి వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లు ఖరారు చేసి పనులు చేపట్టేలా సీడబ్ల్యూసీ ప్రణాళిక రచించింది. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయమే రూ.33,168.23 కోట్లని, అందువల్ల 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని ప్రధాని మోదీకి నాడు సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ అనేక సార్లు విన్నవించారు. ఈ క్రమంలో తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలన్న వైఎస్‌ జగన్‌ వినతిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీ–జనసేనకు పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో పోలవరానికి నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపితే అది ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారుతుందని, అందువల్ల దాన్ని ఆపేయాలని బీజేపీ అధిష్టానంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇలా అడ్డుపుల్ల వేయడంతో నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ పక్కన పెట్టింది. జలవిద్యుత్కేంద్రంపోలవరం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించాలి. ఎడమ వైపు ఉన్న కొండను తొలిచి 12 ప్రెజర్‌ టన్నెల్స్‌ తవ్వి టర్బైన్లను అమర్చి విద్యుత్కేంద్రాన్ని పూర్తి చేయాలి.2014–19: టీడీపీ హయాంలోజలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనుల్లో కొండను తొలిచే పనుల్లో కేవలం 25 శాతం మాత్రమే చేసి టీడీపీ సర్కార్‌ చేతులు దులుపుకొంది.2019–24: వైఎస్సార్‌ సీపీ పాలనలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలవిద్యుత్కేంద్రం పనులు శరవేగంగా సాగాయి. కొండను తొలిచే పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేసి 12 ప్రెజర్‌ టన్నెల్స్‌ను పూర్తి చేసింది. టర్బైన్లను అమర్చడానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసింది. టర్బైన్ల తయారీ బాధ్యతను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. జలవిద్యుత్కేంద్రం పనులను దాదాపుగా కొలిక్కి తెచి్చంది. పోలవరం జలాశయం పనులు పూర్తయ్యేలోగా విద్యుదుత్పత్తి ప్రారంభించే విధంగా జలవిద్యుత్కేంద్రం పనులను వేగవంతం చేసింది. 2014–19: టీడీపీ హయాంలో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను నిర్మించకముందే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో పునాది డయాఫ్రమ్‌వాల్‌ను 1,396 మీటర్ల పొడవున పూర్తి చేసిన చంద్రబాబు 2018 జూన్‌ 11న జాతికి అంకితం చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలంటే 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో ముంపునకు గురయ్యే 54 గ్రామాల్లోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈమేరకు సీడబ్ల్యూసీ, పీపీఏకు హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్‌ 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు ప్రారంభించింది. అయితే రూ.484 కోట్లు ఖర్చు చేసి కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మిగతా నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, కాఫర్‌ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసిన చంద్రబాబు సర్కార్‌ ఆ పనులను పూర్తి చేయలేక చేతులెత్తేసింది. 2019 జూన్‌లో ప్రారంభమైన గోదావరి వరద ప్రవాహానికి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారింది. దాంతో కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌వాల్‌ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో సగటున 26 మీటర్ల నుంచి 36.5 మీటర్ల లోతు వరకు భారీ అగాధాలు ఏర్పడ్డాయి.2019–24: వైఎస్సార్‌ సీపీ పాలనలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ప్రభావం వల్ల ముంపునకు గురయ్యే 8,446 కుటుంబాలకు రూ.1,670 కోట్లతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఆ తర్వాత ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో, దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లతోపాటు 2.1 కి.మీ. పొడవున అప్రోచ్‌ ఛానల్, 2.92 కి.మీ. పొడవున స్పిల్‌ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్‌ ఛానల్‌ను పూర్తి చేసి 2021 జూన్‌ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించింది.స్పిల్‌ వేగోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వేను నిర్మించాలి. ప్రాజెక్టు పనుల్లో తొలుత పూర్తి చేయాల్సింది స్పిల్‌ వేనే. 1,118 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించే స్పిల్‌ వేకు 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల వరకూ 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చాలి. వరద వచి్చనప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా అత్యాధునిక హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లను గేట్లకు అమర్చాలి. ప్రపంచంలో గరిష్టంగా వరద జలాలను దిగువకు విడుదల చేసే అతి పెద్ద స్పిల్‌ వే పోలవరంలోనే ఉంది.2014–19: టీడీపీ హయాంలో 2014 జూన్‌ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 2016 డిసెంబర్‌ 30న స్పిల్‌ వే పనులను ప్రారంభించారు. టీడీపీ అధికారం కోల్పోయే నాటికి అంటే 2019 మే 29 నాటికి స్పిల్‌ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్‌ వేలో కేవలం రెండు (39, 40) పియర్స్‌ను 30 మీటర్ల వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకు పెట్టి గేట్‌ అమర్చినట్లు 2018 డిసెంబర్‌ 24న చంద్రబాబు ఘనంగా ప్రకటించుకున్నారు.2019–2024: వైఎస్సార్‌సీపీ పాలనలో2019 మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది జూన్‌లో ప్రారంభమైన వరద ప్రవాహం నవంబర్‌ వరకూ కొనసాగింది. 2020 మార్చి నుంచి 2021 వరకూ కరోనా మహమ్మారి విరుచుకు పడింది. అయితే గోదావరి వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్‌ జగన్‌ రికార్డు సమయంలో స్పిల్‌ వేను పూర్తి చేశారు. లాక్‌డౌన్‌లోనూ జర్మనీ, జపాన్‌ నుంచి హైడాల్రిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను దిగుమతి చేసుకుని స్పిల్‌ వేకు 48 గేట్లను బిగించారు. 2021 జూన్‌ 11న గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా విజయవంతంగా మళ్లించారు.

Chandrababu Former PS Pendyala Srinivas is back in AP Secretariat
సచివాలయంలో పెండ్యాల ప్రత్యక్షం

సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్‌’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో విదేశాలకు పరారైన పెండ్యాల శ్రీనివాస్‌ మళ్లీ తెరపైకి వచ్చారు. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్‌’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్‌ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శ్రీనివాస్‌ అమెరికాలో అజ్ఞాతవాసాన్ని ముగించుకుని సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనపై సస్పెన్షన్‌ ఎత్తివేసి, పోస్టింగ్‌ ఇవ్వాలని అధికారులను కోరారు. నల్లమూటలు బాబు బంగ్లాకు చేర్చించి పెండ్యాలే2014 – 19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్‌ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్‌గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు షెల్‌ కంపెనీల ప్రతినిధి మనోజ్‌ పార్థసాని హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పెండ్యాల శ్రీనివాస్‌కు ఉన్న రెండు ఈ మెయిల్‌ ఐడీలకు మెయిల్‌చేయడంతోపాటు హైదరాబాద్‌లోని ఆయన చిరునామాకు స్పీడ్‌పోస్ట్‌ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె సీఐడీ అధికారులకు తెలిపారు. నోటీసులు జారీ కాగానే పెండ్యాల శ్రీనివాస్‌ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అమెరికాకు పరారయ్యారు. తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్తున్నట్టు ఆయన ప్రణాళిక శాఖకు ఓ మెయిల్‌ ద్వారా తెలిపి వెళ్లిపోయారు.మెమో జారీ చేసినా బేఖాతరు.. సస్పెన్షన్‌పెండ్యాల శ్రీనివాస్‌ అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రణాళిక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆయన సెలవు దరఖాస్తును తిరస్కరించి, మెమో జారీచేసింది. అధికారులు హైదరాబాద్‌లోని పెండ్యాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రికి మెమో కాపీని అందించారు. మెమో అందుకున్నప్పటి నుంచి వారం రోజుల్లో ఆఫీసుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని పెండ్యాల శ్రీనివాసరావును ప్రణాళిక శాఖ ఆదేశించింది. ఆ మెమోను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ సర్వీసు నిబంధనలను అనుసరించి పెండ్యాల శ్రీనివాస్‌ను ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 30న సస్పెండ్‌ చేసింది.బాబు రాగానే మళ్లీ ప్రత్యక్షంకాగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పెండ్యాల శ్రీనివాస్‌ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బుధవారం నేరుగా సచివాలయానికి వచ్చి తనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించి, పోస్టింగ్‌ ఇవ్వాలని ప్రణాళిక శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే సాగుతోందన్నది సుస్పష్టమవుతోంది. ఎందుకంటే స్కిల్‌ కుంభకోణం కేసులోనే చంద్రబాబు అరెస్ట్‌ అయి 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్‌ను సీఐడీ సాక్షిగా పేర్కొంది. దాంతో ఆ కేసు దర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు పెండ్యాల శ్రీనివాస్‌ను కూడా ఒక సాధనంగా వాడుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా స్పష్టమవుతోంది. స్కిల్‌ కుంభకోణం కేసును నీరుగార్చే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పెండ్యాల శ్రీనివాస్‌ తిరిగి వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే.

Hospitality industry faces talent crunch, to add 1 mn jobs in few years
ఆతిథ్య రంగంలో కొలువుల మేళా!

ముంబై: ఆతిథ్య రంగం నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీంతో వచ్చే కొన్నేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ఆతిథ్య పరిశ్రమలో డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సామర్థ్యాలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం నిపుణుల కొరతకు కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిశ్రమవ్యాప్తంగా డిమాండ్‌–సరఫరా మధ్య అంతరాయం 55–60 శాతంగా ఉంటుందని ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా డైరెక్టర్‌ సంజయ్‌ శెట్టి తెలిపారు. కరోనా విపత్తు తర్వాత పరిశ్రమలో బూమ్‌ (అధిక డిమాండ్‌) నెలకొందని, వచ్చే కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆతిథ్య పరిశ్రమలో నియామకాలు 4 రెట్లు పెరిగిన ట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరంభ స్థాయి ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్టు చెప్పారు. నిపుణుల అంతరాన్ని అధిగమించేందుకు ఆతిథ్య కంపెనీలు తమ సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్టు నిపుణులు వెల్లడించారు. పోటీతో కూడిన వేతనాలు ఆఫర్‌ చేస్తూ ఉన్న సిబ్బందిని కాపాడుకోవడంతోపాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ‘‘2023లో పర్యాటకం, ఆతిథ్య రంగం 11.1 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. 2024 చివరికి 11.8 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. ఈ డిమాండ్‌ 2028 నాటికి 14.8 మిలియన్లకు పెరగొచ్చు. ఏటా 16.5 శాతం వృద్ధికి ఇది సమానం’’అని టీమ్‌లీజ్‌ బిజినెస్‌ హెడ్‌ ధృతి ప్రసన్న మహంత వివరించారు. ప్రస్తుత సిబ్బంది, భవిష్యత్‌ మానవ వనరుల అవసరాల మధ్య ఎంతో అంతరం కనిపిస్తున్నట్టు టీమ్‌లీజ్‌ సరీ్వసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్, స్టాఫింగ్‌ బిజినెస్‌ హెడ్‌ ఎ.బాలసుబ్రమణియన్‌ సైతం తెలిపారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అప్రెంటిస్‌షిప్‌ల ద్వారా నిపుణుల కొరతను తీర్చుకునేందుకు ఈ టాస్‌్కఫోర్స్‌ కృషి చేస్తోంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement