యూఎస్‌ మార్కెట్లకు ట్రంప్‌ జోష్

US Market up on trump comments on stimulus package - Sakshi

డోజోన్స్‌ 161 పాయింట్లు- నాస్‌డాక్‌ 159 పాయింట్లు అప్‌

అదే బాటలో ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌

అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా, యాపిల్‌, గూగుల్‌ ప్లస్‌లో

గత వారం 3.3- 4.6 శాతం మధ్య ఎగసిన మార్కెట్లు

డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్న ప్యాకేజీకంటే మరింత అధికంగా స్టిములస్‌ చర్యలకు సిద్ధమంటూ తాజాగా అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంతో వారాంతాన స్టాక్‌ మార్కెట్లకు జోష్‌ వచ్చింది. వారం మొదట్లో అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ ట్రంప్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్‌161 పాయింట్లు(0.6%) బలపడి 28,587 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 30 పాయింట్లు(0.9%) పుంజుకుని 3,477 వద్ద  ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 159 పాయింట్లు(1.4%) జంప్‌చేసి 11,580 వద్ద స్థిరపడింది. ఆగస్ట్‌ తదుపరి గత వారం యూఎస్‌ మార్కెట్లు అత్యధికంగా లాభపడ్డాయి. డోజోన్స్‌ 3.3 శాతం, ఎస్‌అండ్‌పీ 3.8 శాతం, నాస్‌డాక్‌ 4.6 శాతం చొప్పున ఎగశాయి.

ఫాంగ్‌ స్టాక్స్‌ జోరు
ఫాంగ్‌ స్టాక్స్‌లో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, , నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌ 3-1.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇతర కౌంటర్లలో ఫార్మా దిగ్గజం ఆస్ట్రా జెనెకా 1.2 శాతం పుంజుకోగా.. ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా ఇంక్‌, సేల్స్‌ఫోర్స్‌ 2 శాతం చొప్పున లాభపడ్డాయి. నార్వేజియన్‌ క్రూయిజర్‌ 3 శాతం జంప్‌చేయగా.. షెవ్రాన్‌ కార్పొరేషన్‌ 1.6 శాతం క్షీణించింది. ఫైజర్‌, బోయింగ్‌ 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top