జాక్‌పాట్ కొట్టేసింది! | Glamour point | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్ కొట్టేసింది!

Mar 31 2015 11:25 PM | Updated on Oct 17 2018 4:36 PM

జాక్‌పాట్ కొట్టేసింది! - Sakshi

జాక్‌పాట్ కొట్టేసింది!

విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన రిదిమకు అకాడమీ సినిమాల గురించి మాట్లాడుకునే అవకాశం కంటే అకాడమిక్ పుస్తకాల

గ్లామర్ పాయింట్

విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన రిదిమకు అకాడమీ సినిమాల గురించి మాట్లాడుకునే అవకాశం కంటే అకాడమిక్ పుస్తకాల గురించి మాట్లాడే అవకాశమే ఎక్కువగా వచ్చేది. సినిమాల గురించి మాట్లాడుకున్న సందర్భం కంటే సీరియస్ టాపిక్‌ల మీద మాట్లాడుకున్న సందర్భాలే ఎక్కువ.

న్యూయ్యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత బుద్ధిగా వాల్‌స్ట్రీట్‌లో 9 టు 5 జాబ్‌లో చేరింది రిదిమ.
 అయినంత మాత్రాన మనసులో దాగున్న ‘కళ’ ఊరికే ఉంటుందా? అందుకే నెలలు తిరక్కుండానే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి తన అభిరుచిని వెదుక్కుంటూ ముంబాయికి వచ్చింది రిదిమ. సినిమాల కంటే ముందు వొడాఫోన్, కోకోకోలా, టైటాన్... మొదలైన యాడ్స్‌లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె జాక్‌పాట్ కొట్టేసింది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే జోయా అఖ్తర్ ‘దిల్ దడ్‌కన్’ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. తనకు ‘2015’ బాగా కలిసొచ్చే సంవత్సరం అని రిదిమ నమ్ముతోంది. ఆమె నమ్మకం నిజం కావాలని ఆశిద్దాం.
 

Advertisement
 
Advertisement
Advertisement