వాల్స్ట్రీట్లో అడుగుపెట్టబోతున్న ఫ్లిప్కార్ట్ | Sakshi
Sakshi News home page

వాల్స్ట్రీట్లో అడుగుపెట్టబోతున్న ఫ్లిప్కార్ట్

Published Wed, Jan 11 2017 12:47 PM

వాల్స్ట్రీట్లో అడుగుపెట్టబోతున్న ఫ్లిప్కార్ట్ - Sakshi

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వాల్ స్ట్రీట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీ నాస్డాల్లో ఐపీఓ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు ప్రీపేర్ అవుతోందని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ చేసింది. ఇదే సమయంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకదాన్ని నియమించుకోనున్నట్టు బుధవారం తెలిపింది. 2018లో ఈ సంస్థ నాస్డాక్లో ఐపీఓకు రావొచ్చని రిపోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో బిన్నీ బన్సాల్ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలిపినట్టు రిపోర్టు వెల్లడించింది. ఐపీవో ద్వారా తన కీలక కర్తవ్యాన్ని చూడబోతున్నారంటూ ఉద్యోగులకు ఆయన తెలిపారు.
 
కాగ, సోమవారం ఫ్లిప్కార్ట్ మాజీ టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్ కృష్ణమూర్తిని సీఈవోగా నియమించి, సహవ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ను గ్రూప్ సీఈవోగా కూర్చోపెట్టింది.  తన పెట్టుబడిదారుల్లో ఒకరు సంస్థను గట్టి నియంత్రణలో పెట్టాలని ఫ్లిప్కార్ట్ భావించింది. తాజా మార్పులతో ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక పెట్టుబడులు కలిగిన టైగర్‌ గ్లోబల్‌ కంపెనీకి, సంస్థ గాడ్‌ ఫాదర్‌గా పేరొందిన లీ ఫిక్సెల్‌కు మేనేజ్‌మెంట్‌ స్థాయిలో పూర్తిస్థాయిలో నియంత్రణ దక్కినట్టు అయింది. భారతీయ కీలక ఈ-కామర్స్‌ కంపెనీ బోర్డు రూమ్‌లో ఈ కంపెనీలు నిర్ణయాత్మక స్థితికి చేరుకోవడం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement