ఎంఎస్‌ఎంఈలకు షిప్‌రాకెట్‌ దన్ను  | Shiprocket to set up three more dark stores in India | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలకు షిప్‌రాకెట్‌ దన్ను 

Jun 10 2025 4:47 AM | Updated on Jun 10 2025 9:33 AM

Shiprocket to set up three more dark stores in India

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఈ–కామర్స్‌ సరీ్వసుల సంస్థ షిప్‌రాకెట్‌ తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్‌ఎంఈ) మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ప్లాట్‌ఫాంపై 3 లక్షల మంది పైగా విక్రేతలు ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ ప్లాట్‌ఫాం ద్వారా 18,000 విక్రేతలు లావాదేవీలు సాగిస్తున్నట్లు సంస్థ సీఈవో అతుల్‌ మెహతా (డొమెస్టిక్‌ షిప్పింగ్‌) సోమవారమిక్కడ తెలిపారు.

 గత ఆర్థిక సంవత్సరం రెండు రాష్ట్రాల్లో సుమారు 35 లక్షల పైగా డెలివరీలు నమోదయ్యాయని ఎస్‌ఎంఈల కోసం షిప్‌రాకెట్‌ యాత్ర 2025 కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తమకు 32 గిడ్డంగులు ఉండగా, హైదరాబాద్‌లో ఒకటి ఉందన్నారు. 3 డార్క్‌ స్టోర్స్‌ ఉండగా.. తదుపరి విడతలో హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్లతో డెలివరీ, క్విక్‌ డెలివరీ విభాగాలపైనా దృష్టి పెడుతున్నామని మెహతా వివరించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement