సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు | Sensex Plunges 750 Points, Nifty Below 22,000 | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Feb 28 2024 3:50 PM | Updated on Feb 28 2024 4:20 PM

Sensex Plunges 750 Points, Nifty Below 22,000 - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఇతర ఆసియా మార్కెట్‌ల మిక్స్‌డ్‌ ఫలితాల ప్రభావంతో దేశీయ స్టాక్‌ సూచీలు లాభనష్టాలతో ఊగిసలాడాయి. అదే ధోరణి కొనసాగడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 790 పాయింట్ల నష్టంతో 72304 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 21951 వద్ద ముగిశాయి. 

హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్, ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్ని గడించగా.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, అపోలో హాస్పిటల్‌,ఎథేర్‌మోటార్స్‌, మారుతి సుజికి,బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి.    

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement