రూపాయి 30 పైసలు డౌన్‌ | Rupee falls 30 paise to Rs 94. 63 against Dollar | Sakshi
Sakshi News home page

రూపాయి 30 పైసలు డౌన్‌

Jun 23 2026 12:30 AM | Updated on Jun 23 2026 12:30 AM

Rupee falls 30 paise to Rs 94. 63 against Dollar

94.63 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ 30 పైసలు బలహీనపడి 94.63 వద్ద ముగిసింది. పశ్చిమాసియా శాంతి ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధత, డాలర్‌ బలోపేతం కావడం అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచింది. ఫారెక్స్‌ మార్కెట్లో ఉదయం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 94.42 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన రూపాయి, 94.24 – 94.76 శ్రేణిలో కదలాడింది. ‘‘స్వల్పకాలంలో 94.10 స్థాయి వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. అలాగే, ఎగువ స్థాయిలో 95.30 వద్ద నిరోధం ఉందని’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ నిపుణుడు దిలీప్‌ పార్మర్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement