త్వరలోనే యుద్ధానికి ముగింపు | Donald Trump Halts Iran Strikes As Talks Resume Again | Sakshi
Sakshi News home page

త్వరలోనే యుద్ధానికి ముగింపు

Aug 3 2026 5:46 AM | Updated on Aug 3 2026 5:46 AM

Donald Trump Halts Iran Strikes As Talks Resume Again

ఇరాన్‌పై దాడులకు ఆదేశాలు ఇవ్వడం వాయిదా: ట్రంప్‌ వెల్లడి

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో ముద్ధం త్వరలో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంకేతాలిచ్చారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించడానికి గల్ఫ్‌లోని మిత్రదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని తెలిపారు. ఐదు నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలో ప్రస్తుతానికి కొత్త దాడులకు ఆదేశాలు జారీ చేయడాన్ని వాయిదా వేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్‌ శనివారం సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. యుద్ధానికి ముగించడానికి వీలుగా ఇరాన్‌తో ఒప్పందాన్ని పూర్తి చేసే విషయంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని వెల్లడించారు. 

త్వరగా ఘర్షణ ముగించండి: సౌదీ యువరాజు  
హార్మూజ్‌ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై దాడులను అమెరికా మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంపై సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలని, శాంతి సాధన కోసం చొరవ చూపాలని ట్రంప్‌ను కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అమెరికా సైన్యం ఇరాన్‌ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు ఉధృతం చేస్తే అందుకు ప్రతిస్పందనగా గల్ఫ్‌ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక సదుపాయాలపై ఇరాన్‌ సైన్యం భీకర స్థాయిలో విరుచుకుపడే ప్రమాదం ఉందని సౌదీ అరేబియా ఆందోళన చెందుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement