RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ! | Royal Enfield Flying Flea C6 Electric Motorcycle Deliveries Begin | Sakshi
Sakshi News home page

RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ!

Jun 20 2026 2:51 PM | Updated on Jun 20 2026 3:02 PM

Royal Enfield Flying Flea C6 Electric Motorcycle Deliveries Begin

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఫ్లయింగ్ ఫ్లీ C6 డెలివరీలు (బెంగళూరులో) ప్రారభించింది. కేవలం వాహనాన్ని విక్రయించడం మాత్రమే కాకుండా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు స్పెషల్ సపోర్ట్ నెట్‌వర్క్‌ను కూడా సంస్థ ఏర్పాటు చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే ఉన్న షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో షాప్-ఇన్-షాప్ విధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా ప్రత్యేకంగా కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయకుండా.. ఇప్పటికే ఉన్న డీలర్ నెట్‌వర్క్ ద్వారా ఫ్లయింగ్ ఫ్లీ బైకును విస్తరించనున్నారు. అంతే కాకుండా.. వినియోగదారులకు 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ప్రయాణ సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే సహాయం అందించేలా ఉంటుంది.

ఫ్లయింగ్ ఫ్లీ C6 ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే.. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) స్కీమ్ ద్వారా ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 1.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాలి. దీని వల్ల ప్రారంభ పెట్టుబడి తగ్గి, మరింత మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని సులభంగా కొనుగోలు చేసే అవకాశం పొందుతారు.

ఈ మోటార్‌సైకిల్‌లో 3.91 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 154 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఉన్న పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 15.4 కిలోవాట్ల పవర్, 60 న్యూటన్ మీటర్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 0 నుంచి 60 కిమీ వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.

ఫ్లయింగ్ ఫ్లీ C6 బరువు కేవలం 124 కిలోలు మాత్రమే ఉండటం వల్ల ఇది తేలికగా ఉంటుంది. అయితే 19 అంగుళాల పెద్ద చక్రాలు, సన్నని 90 సెక్షన్ టైర్లు నగర రహదారులపై సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి.

ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 3.5 అంగుళాల రౌండ్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, అడ్జస్టబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐదు రైడింగ్ మోడ్‌లు, లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి. ఇవి రైడింగ్‌ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement