జియో రీఛార్జ్: 84 రోజుల వ్యాలిడిటీ.. 126జీబీ డేటా! | Reliance Jio Rs 889 Recharge Plan Details and Benefits | Sakshi
Sakshi News home page

జియో రీఛార్జ్: 84 రోజుల వ్యాలిడిటీ.. 126జీబీ డేటా!

Oct 6 2026 1:40 PM | Updated on Oct 6 2026 2:19 PM

Reliance Jio Rs 889 Recharge Plan Details and Benefits

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లో రూ.889 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే లభించే ప్రయోజనాలు ఏమిటి?, వ్యాలిడిటీ ఎంత?, అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

జియో అందించే రూ.889 రీఛార్జ్ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ వ్యవధిలో రోజుకు 1.5జీబీ హై-స్పీడ్ డేటా చొప్పున మొత్తం 126జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను కూడా పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో కేవలం డేటా, కాలింగ్ ప్రయోజనాలే కాకుండా.. కొన్ని అదనపు సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో జియోసావన్ ప్రో, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి సేవలు లభిస్తాయి. ముఖ్యంగా.. మ్యూజిక్, టీవీ కంటెంట్, క్లౌడ్ స్టోరేజ్ వంటి వాటిని ఉపయోగించే వారికి ఈ బెనిఫిట్స్ ఉపయోగపడవచ్చు.

ఇక ఈ ప్లాన్‌లో మరో ప్రత్యేక ప్రయోజనం జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్. అంటే.. అర్హత ఉన్న కస్టమర్లు తమ జియో నంబర్‌తో జియోహాట్‌స్టార్‌లో లాగిన్ అయి ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే.. ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన తర్వాత కూడా జియోహాట్‌స్టార్‌ ప్రయోజనాన్ని కొనసాగించాలంటే, 48 గంటల్లోపు అర్హత కలిగిన మరో ప్లాన్‌తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: జియో రీచార్జ్‌: 30 రోజుల ప్లాన్.. 25జీబీ డేటా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement