జియో రీచార్జ్‌: 30 రోజుల ప్లాన్.. 25జీబీ డేటా! | Reliance Jio Rs 355 Recharge Plan Details and Benefits | Sakshi
Sakshi News home page

జియో రీచార్జ్‌: 30 రోజుల ప్లాన్.. 25జీబీ డేటా!

Oct 5 2026 7:21 PM | Updated on Oct 5 2026 7:47 PM

Reliance Jio Rs 355 Recharge Plan Details and Benefits

దేశీయ టెలికాం దిగ్గజం.. రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న రీచార్జ్‌ ప్లాన్‌లో రూ.355 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమిటి?, వ్యాలిడిటీ ఎంత?, అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ.355 జియో రీఛార్జ్ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులు. మొత్తం 25 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే.. రోజుకు ప్రత్యేకంగా డేటా లిమిట్ కాకుండా, 30 రోజుల వ్యవధిలో మీ అవసరానికి అనుగుణంగా 25జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చన్నమాట. డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి.

ఈ ప్లాన్‌లో ముఖ్యంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. అంటే రీఛార్జ్‌తో పాటు మొబైల్‌లో జియోహాట్‌స్టార్‌ కంటెంట్‌ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. అయితే.. ప్లాన్ గడువు ముగిసిన 48 గంటల్లోపు అర్హత ఉన్న మరో ప్లాన్‌తో రీఛార్జ్ చేయాలి. అలా చేస్తేనే జియోహాట్‌స్టార్‌ ప్రయోజనం కొనసాగుతుంది. జియోహాట్‌స్టార్‌, జియోఏఐక్లౌడ్ వంటి సేవలను ఉపయోగించేటప్పుడు ఇదే జియో నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

ఇక ఈ ప్లాన్‌లో మరో ప్రయోజనం జియోఏఐక్లౌడ్ ద్వారా ఉచితంగా 50GB క్లౌడ్ స్టోరేజ్. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి ఫైళ్లను ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా.. ఫోన్ స్టోరేజ్ తక్కువగా ఉన్నవారికి ఈ అదనపు క్లౌడ్ స్టోరేజ్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి: జియో రూ.449 రీచార్జ్‌ ప్లాన్: ప్రయోజనాలివే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement