అది ఇల్లీగల్‌.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు సుప్రీం షాక్‌ | Rejecting JSW Steel plan Supreme Court orders BPSL liquidation | Sakshi
Sakshi News home page

అది ఇల్లీగల్‌.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు సుప్రీం షాక్‌

May 3 2025 7:29 AM | Updated on May 3 2025 9:56 AM

Rejecting JSW Steel plan Supreme Court orders BPSL liquidation

న్యూఢిల్లీ: భూషణ్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (బీపీఎస్‌ఎల్‌)ను దక్కించుకోవడానికి సంబంధించి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కంపెనీ సమర్పించిన పరిష్కార ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఇది దివాలా చట్టానికి (ఐబీసీ) విరుద్ధమని, అక్రమమని స్పష్టం చేసింది. ఐబీసీ కింద బీఎస్‌పీఎల్‌ లిక్విడేషన్‌ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని (ఎన్‌సీఎల్‌టీ) సుప్రీం కోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే, దివాలా చట్టం కింద 2021లో బీఎస్‌పీఎల్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 49% వాటా దక్కించుకుంది. తర్వాత దీన్ని 83%కి పెంచుకుంది. అయితే, ఇందుకు అనుసరించిన విధానం, నిబంధనలకు విరుద్ధంగా ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అలాగే, నిర్దేశిత గడువులోగా పరిష్కార ప్రణాళికను అమలు చేయలేదని పేర్కొంది.

ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, పూర్తి ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఎక్స్చేంజీలకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తెలిపింది.  ఈ వార్తలతో శుక్రవారం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు సుమారు 5% క్షీణించి రూ. 972 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement