ఐదు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా.. భారీ జరిమానా | RBI Fines ICICI Axis and Other Three Banks Regulatory Compliance | Sakshi
Sakshi News home page

ఐదు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా.. భారీ జరిమానా

May 4 2025 9:09 PM | Updated on May 4 2025 9:12 PM

RBI Fines ICICI Axis and Other Three Banks Regulatory Compliance

నిబంధనలు పాటించడంలో విఫమైతే 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI).. ఏ బ్యాంకుపై అయిన కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్‌లతో సహా మొత్తం ఐదు బ్యాంకులకు ఆర్‌బీఐ జరిమానాలు విధించింది.

బ్యాంకులలో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్,కేవైసీ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ మొదలైనవాటికి సంబంధించిన ఆదేశాలను పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంకుకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 97.80 లక్షల జరిమానా విధించింది.

కస్టమర్ సేవలు, బ్యాంకులు అందించే ఆర్థిక సేవలకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంక్ ఆఫ్ బరోడా విఫలమైందని.. ఆర్‌బీఐ రూ. 61.40 లక్షల జరిమానా విధించింది. అంతర్గత ఖాతాల అనధికార నిర్వహణకు సంబంధించిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంకుకు కూడా రూ. 29.60 లక్షల జరిమానా పడింది.

ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందిన వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం స్వల్పకాలిక రుణాలకు వడ్డీ రాయితీ పథకంపై కొన్ని ఆదేశాలను పాటించనందుకు ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌పై కేంద్ర బ్యాంకు రూ. 31.8 లక్షలు, కేవైసీకి సంబంధించిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ. 31.80 లక్షల జరిమానా విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement