ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్ | Indian Railways Announces Nationwide Digital Clock Design Competition Full Details | Sakshi
Sakshi News home page

ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్

May 4 2025 7:54 PM | Updated on May 4 2025 8:06 PM

Indian Railways Announces Nationwide Digital Clock Design Competition Full Details

భారతదేశంలో రైల్వే స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రేల్వే దేశవ్యాప్తంగా ఒక పోటీ ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో, స్టేషన్ ప్రాంగణాలలో ఉపయోగించే గడియారాలు ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ పోటీలో పాల్గొనేవారిని ''ప్రొఫెషనల్స్, కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు (12వ తరగతి వరకు)'' అని మూడు వర్గాలుగా విభజించడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్‌లను 2025 మే 1 నుంచి మే 31 మధ్య ఆన్‌లైన్‌లో (contest.pr@rb.railnet.gov.in) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ పోటీ గురించి రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'దిలీప్ కుమార్' మాట్లాడుతూ.. గెలుపొందిన విజేతకు.. మొదటి బహుమతి రూ. 5 లక్షలు అందిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా మూడు విభాగాలలో ఇదుమందికి కన్సోలేషన్ బహుమతులుగా రూ. 5000 చొప్పున ఇవ్వనున్నట్లు స్పష్టంగా చేశారు.

ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్లను.. హై రిజల్యూషన్‌లో, ఎలాంటి వాటర్ మార్క్ లేదా లోగో వంటివి లేకుండా, ఒరిజినాలిటీ సర్టిఫికెట్‌తో సబ్మిట్ చేయాలని దిలీప్ కుమార్ పేర్కొన్నారు. డిజైన్ వెనుక ఉన్న థీమ్.. ఆలోచనను వివరించే కాన్సెప్ట్ నోట్ కూడా ఉండాలి. మీరు సబ్మిట్ చేసే డిజైన్స్ అసలైనవిగా ఉండాలి, వాటిపై ఎలాంటి కాపీరైట్స్ ఉండకూడదని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!

పాఠశాల విభాగంలో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్ ఐడీ కార్డును సైతం అప్‌లోడ్ చేయాలి. కళాశాల విభాగంలో ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో చేరిన వ్యక్తులు సంబంధిత ఐడీ కార్డును అందించాలి. మిగిలినవారు ప్రొఫెషనల్ కేటగిరీ కిందకు వస్తారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement