ఘనంగా రమేష్ హాస్పిటల్స్ వార్షికోత్సవ వేడుకలు! | Ramesh Hospitals Celebrates 38 Years of Excellence in Healthcare | Sakshi
Sakshi News home page

ఘనంగా రమేష్ హాస్పిటల్స్ వార్షికోత్సవ వేడుకలు!

Aug 14 2026 4:25 PM | Updated on Aug 14 2026 4:47 PM

Ramesh Hospitals Celebrates 38 Years of Excellence in Healthcare

1988 ఆగస్టు 15న కేవలం ఆరు పడకలతో ప్రత్యేక గుండె వైద్య ఆసుపత్రిగా ప్రారంభమైన రమేష్ హాస్పిటల్స్, 38 ఏళ్ల సేవా ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థగా ఎదిగింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ప్రాంతానికే చేరువ చేయాలనే లక్ష్యంతో సాగిన ఈ ప్రయాణంలో లక్షలాది మంది రోగుల విశ్వాసాన్ని సంస్థ సంపాదించింది.

ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, తిరువూరు కేంద్రాల ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యం, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్, అవయవ మార్పిడి, డిజిటల్ ఆరోగ్య సేవలు, గ్రామీణ వైద్యం, వైద్య విద్య, పరిశోధన వంటి విభాగాల్లో సేవలు అందిస్తోంది. ఈ 38 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న విజయవాడలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బి. సోమరాజు ముఖ్య అతిథిగా హాజరుకాగా, డాక్టర్ కామినేని పట్టాభి రామయ్య, డాక్టర్ సమరం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను రాయితీలతో మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన రమేష్ ప్రీమియం హెల్త్ కార్డును ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం.సి. దాస్ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement