వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ | one of best mobile OnePlus Nord CE5 powerful mid range 5G smartphone | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్

Aug 7 2025 11:34 AM | Updated on Aug 7 2025 12:31 PM

one of best mobile OnePlus Nord CE5 powerful mid range 5G smartphone

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ 'వన్‌ప్లస్‌' వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ' సిరీస్‌ను ఒక ప్రధాన లక్ష్యంతో తీసుకొచ్చింది. ఇది శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్స్, యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన సిగ్నేచర్ వన్‌ప్లస్‌ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. దీనికి 'వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5' (OnePlus Nord CE5) ఒక ఉదాహరణ. లేటెస్ట్ వన్‌ప్లస్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలను కలిగి, ఆక్సిజన్ఓఎస్ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఇది దాని విభాగంలో.. ధరకు తగిన ఫ్రీమియం ఫీచర్స్ అందిస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5 - వాల్యూ ఫర్ మనీ

రూ.25వేలు లోపు ధర వద్ద బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5. మీరు చెల్లించే డబ్బుకు, తగిన ఫీచర్స్ తప్పకుండా ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు మాత్రమే కాకుండా.. మీ సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా పండుగల సమయంలో గిఫ్ట్‌గా ఇవ్వడానికి అనువైనది.

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5 ఫీచర్లు ఇలా..

మీడియాటెక్ 8350 అపెక్స్

ప్రతి మొబైల్‌కు కీలకంగా వ్యవహరించేది దాని ప్రాసెసర్‌. నార్డ్ సీఈ5లో మీడియాటెక్ 8350 అపెక్స్ చిప్ సెట్ ఉంది. ఇది దాని పనితీరును సూచిస్తుంది.  వినియోగదారుల కోసం రూపొందించబడిన కొత్త తరం ప్రాసెసర్ ఇది. యువత మొబైల్‌ స్పీడ్‌లో రాజీపడకుండా మెరుగైన పనితీరును కోరుకుంటారు. కాబట్టి దీన్ని సమర్థవంతమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. యూజర్లకు అంతరాయం లేకుండా యాప్‌ను రన్‌ చేస్తూ, అప్రయత్నంగా మల్టీ టాస్కింగ్ నిర్వహిస్తుంది. పెద్ద సైజ్‌లో ఉన్న గేమ్‌లను కూడా 120 ఎఫ్‌పీఎస్‌తో స్మూత్ గేమింగ్ పనితీరును నిర్ధారిస్తుంది. వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా పనితీరును ఆప్టిమైజ్ చేసేలా కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తుంది.

సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే

నార్డ్ సీఈ5లో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.  ఇది మంచి విజువల్‌ను అందిస్తుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్, బటర్ స్మూత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ వేగంగా స్పందిస్తుంది. సాధారణంగా అధిక బ్రైట్‌నెస్‌ అవుట్ డోర్ విజిబిలిటీకి సమస్యగా ఉంటుంది. హెచ్‌డీఆర్‌10+ కాంట్రాస్ట్, కలర్ క్లారిటీతో ఈ సమస్యకు నార్డ్‌ సీఈ5 చెక్‌ పెడుతుంది. ఇందులోకి ఏఐ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌ విభిన్న లైటింగ్ కండిషన్స్‌లో వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. గేమ్‌ ఆడుతున్నా, ఎక్కువగా స్క్రీన్‌ చూస్తున్నా ఈ డిస్‌ప్లే యూజర్లకు మెరుగైన అనుభవాన్ని సొంతం చేస్తుంది.

కెమెరా సిస్టమ్

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5లో కేవలం మెగాపిక్సెల్స్ కోసమే కాకుండా అర్థవంతమైన ఫొటోగ్రఫీ కోసం డిజైన్ చేసిన రిఫైన్డ్ డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది.

  • 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్: తక్కువ వెలుతురులో కూడా అదిరిపోయే క్లారిటీ, డైనమిక్ రేంజ్ అందిస్తుంది.

  • 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా: ల్యాండ్‌స్కేప్‌, గ్రూప్ షాట్స్, ఆర్కిటెక్చర్ కోసం ఇది ప్రత్యేకమైంది.

  • 60 ఎఫ్‌పీఎస్‌ వద్ద 4కే వీడియో: రియల్ టైమ్ స్టెబిలైజేషన్‌తో ఫ్లూయిడ్, సినిమా క్వాలిటీ రికార్డింగ్ అందిస్తుంది.

ఈ ఫోన్‌లో ప్రతి కెమెరా షాట్‌ను ఎలివేట్ చేసేలా ఏఐ ఆధారిత ఫొటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. సీన్ రికగ్నిషన్, ఇంటెలిజెంట్ హెచ్‌డీఆర్‌, నైట్ స్కేప్ ఆప్టిమైజేషన్, సోషల్ రెడీ కంటెంట్ కోసం రూపొందించిన సృజనాత్మక ఫిల్టర్లు ఉన్నాయి.

అర్థం చేసుకునే ఏఐ

నార్డ్ సీఈ5ను మార్కెట్‌లోని ఇతర ఫోన్లతో నిజంగా వేరు చేసేది అందులో వాడుతున్న కృత్రిమ మేధ. ఇందులో స్మార్ట్ ఉత్పాదకత సాధనాలను వాడారు. ఫోన్‌లోని ఏఐ యూజర్‌ షెడ్యూల్‌ను నిర్వహించగలదు. ఈమెయిల్‌లను చదివి సంక్షిప్తంగా తెలపగలదు. సందర్భోచితంగా నోటిఫికేషన్‌లకు కూడా ప్రాధాన్యత ఇవ్వగలదు.

కెమెరా ఏఐ: ఫొటో తీస్తున్న సమయంలో సబ్జెక్ట్, బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఫోకస్, లైటింగ్, కలర్ టోన్‌లను ఆటో అడ్జస్ట్‌ చేస్తుంది. దీంతో మాన్యువల్‌గా మళ్లీ సదరు ఫొటో లేదా కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్పులు చేయాల్సిన పని ఉండదు.

120 ఎఫ్‌పీఎస్‌ గేమింగ్ పవర్ హౌస్

స్మార్ట్ ఫోన్‌లో గేమింగ్‌ అనేది ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా మారింది. నార్డ్ సీఈ 5 ఈ అనుభవాన్ని చాకచక్యంగా అందిస్తుంది. దాని 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు అందుకు ఎంతో తోడ్పడుతుంది. 120 ఎఫ్‌పీఎస్‌ వద్ద అసాధారణ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

డిజైనింగ్‌

నార్డ్ సీఈ 5 బ్రష్డ్ మ్యాట్ ఫినిష్‌తో హై-గ్రేడ్ పాలీకార్కొనేట్‌తో తయారైంది. యూనిబాడీతో ప్రీమియం లుక్‌ ఉండేలా డిజైన్‌ చేశారు. ఇది విజువల్ అప్పీల్ మాత్రమే కాకుండా మంచి గ్రిప్‌ను కూడా నిర్ధారిస్తుంది. సీఈ5లోని కలర్ ఆప్షన్లు కింది విధంగా ఉన్నాయి.

  • గ్రాఫైట్ ఐస్‌ - రిఫ్లెక్టివ్‌ షైనింగ్‌తో మెటాలిక్‌ గ్రే కలర్‌.

  • మిస్ట్ బ్లూ - హిమానీనదాల నుండి ప్రేరణ పొంది ఈ రంగులో అందిస్తున్నారు.

  • సన్‌సెట్‌ కాపర్‌

ఆక్సిజన్ఓఎస్

ఆక్సిజన్ఓఎస్ తాజా వెర్షన్‌తో నడుస్తున్న నార్డ్ సీఈ 5 రెస్పాన్సివ్‌, యాడ్ ఫ్రీ సాఫ్టేవేర్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్‌ల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇందులోని స్మార్ట్ ఎఫిషియెన్సీ టూల్స్ మెరుగైన షెల్ఫ్ విడ్జెట్లు, సందర్భోచిత యాప్‌ సజెషన్లను అందిస్తున్నాయి. వినియోగదారులకు వారి డిజిటల్ గోప్యతపై మరింత నియంత్రణను కల్పించేలా మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఆల్‌వేస్‌ ఆన్ డిస్‌ప్లే థీమ్స్‌, ఫింగర్ ప్రింట్ యానిమేషన్లు, ఐకాన్ ప్యాక్‌లను నియంత్రిస్తుంది. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు, ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేషన్లను అందిస్తుంది.

5జీ కనెక్టివిటీ

నార్డ్ సీఈ5 డ్యూయల్ 5జీ సిమ్ స్లాట్లను కలిగి ఉంది. ఇది విస్తృత శ్రేణి గ్లోబల్ 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. అధిక రిజల్యూషన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నా, రియల్ టైమ్ క్లౌడ్ గేమింగ్‌లో పాల్గొంటున్నా లేదా అధిక మొబిలిటీ సందర్భాల్లో వీడియో కాలింగ్ చేసినా సీఈ 5 అల్ట్రా లో-లేటెన్సీ వల్ల స్థిరమైన వేగంతో పని చేస్తుంది.

  • హై-స్పీడ్, మెరుగైన ఇంటర్నెట్ కోసం వై-ఫై 6ఈ

  • డ్యూయల్ డివైజ్ ఆడియో సపోర్ట్, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ

  • అంతరాయం లేని మొబైల్ పేమెంట్లు, డివైజ్ పెయిరింగ్ కోసం ఎన్‌ఎఫ్‌సీ

  • వేగవంతమైన డేటా బదిలీ, రివర్స్ ఛార్జింగ్ సామర్థ్యాల కోసం యూఎస్‌బీ-ఈ 3.2 జెన్ 1 సదుపాయం

ఆడియో ఎక్స్ పీరియన్స్

ఆడియో కోసం నార్డ్ సిఇ 5 డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్‌తో స్టీరియో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. గేమింగ్, వీడియోలు చూడటం లేదా కాల్స్‌లో ఉన్నా స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. మ్యూజిక్‌ వింటున్న సమయంలో స్పష్టమైన సంగీతం ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు. యూఎస్‌బీ-సీ ద్వారా హై-రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. రియల్‌టైమ్‌లో పరిసరాల శబ్దం ఆధారంగా వాల్యూమ్ స్థాయిలను నిర్వహించే ఏఐ ఆధారిత ట్యూనింగ్ సిస్టమ్‌ ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

కూలింగ్ సిస్టమ్

ఫోన్‌లో అధిక సైజ్‌ ఉన్న గేమ్‌లు ఎక్కువసేపు ఆడితే మొబైల్‌ వేడవ్వడం సహజం. దీన్ని కట్టడి చేసేందుకు నార్డ్ సీఈ5 మెరుగైన మల్టీ లేయర్ గ్రాఫైట్, వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను పరిచయం చేస్తుంది. ఇది మునుపటి నార్డ్ మోడళ్ల కంటే వేడిని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సుదీర్ఘ గేమింగ్ లేదా వీడియో సెషన్ల సమయంలో కూడా సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.

భద్రత ఫీచర్లు

నార్డ్ సీఈ5 డిస్‌ప్లేపై ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఫీచర​్‌ను అందిస్తుంది. దాంతోపాటు వేగవంతమైన, మరింత సురక్షితమైన యాక్సెస్ కోసం ఏఐ ఆధారిత ఫేస్ అన్‌లాక్‌ వెసులుబాటును ఇస్తుంది. ఇందులోని ప్రైవేట్ సేఫ్ 3.0 ద్వారా సున్నితమైన డాక్యుమెంట్‌లు, ఇమేజ్‌లు, ఫైళ్లను ఎన్ క్రిప్టెడ్‌గా స్టోర్‌ చేసుకోవచ్చు.

చివరగా..

మిడ్ రేంజ్ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5 కీలకంగా వ్యవహరించనుంది. వినియోగదారులను ఆకర్షించే ఇన్నోవేషన్ ప్రీమియం ధరలతోనే రావాల్సిన అవసరం లేదని వన్‌ప్లస్‌ బ్రాండ్ మరోసారి నిరూపించింది. రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్, అర్థవంతమైన ఫీచర్లు, ఇంటెలిజెంట్ డిజైన్ ఎంపికలకు ప్రాధాన్యమిచ్చే నార్డ్‌ సీఈ5ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ నుంచి దాని ఏఐ ఆధారిత కెమెరా వరకు, ఫ్లూయిడ్ 120 హెర్ట్జ్ గేమింగ్ నుంచి ప్రాసెసింగ్ ఎనర్జీ వరకు నార్డ్ సీఈ5 వినియోగదారుకు నమ్మశక్యం కాని అనుభవాన్ని అందిస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ5 వేరియంట్స్ & ధరలు

1) 8 జీబీ + 128 జీబీ: రూ. 24,999
2) 8 జీబీ + 256 జీబీ: రూ. 26,999
3) 12 జీబీ + 256 జీబీ: రూ. 28,999

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement