ఎన్‌ఎస్‌ఈ మెగా ఐపీవో రెడీ | NSE IPO 2026 Biggest IPO India Rs 30000 Crore SEBI Hyundai IPO Record Break | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈ మెగా ఐపీవో రెడీ

Jun 18 2026 7:33 AM | Updated on Jun 18 2026 7:38 AM

NSE IPO 2026 Biggest IPO India Rs 30000 Crore SEBI Hyundai IPO Record Break

సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ దాఖలు

రూ. 30 వేల కోట్ల ఇష్యూతో రికార్డ్‌!

ముంబై: ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు గుడ్‌ న్యూస్‌. ఐపీవోకు సంబంధించి  ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) సెబీ వద్ద ఎన్‌ఎస్‌ఈ బుధవారం దాఖలు చేసింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో మొత్తం 14.89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.

ఇష్యూ పరిమాణం రూ.30,000 కోట్లుగా అంచనా. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనుంది. 2024లో రూ.27,870 కోట్లను సమీకరించిన హ్యుందాయ్‌ ఐపీవో రికార్డును బ్రేక్‌ చేయనుంది. ఎస్‌బీఐ ఒక్కటే 24.75 మిలియన్‌ షేర్లను విక్రయించనుంది. కాగా, ఎన్‌ఎస్‌ఈ 2016లో తొలిసారి ఐపీవో కోసం దరఖాస్తు  చేయగా.. కో–లొకేషన్‌ కేసు, పాలపనాపరమైన అంశాలతో ఉపసంహరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement