సాక్షి మనీ మంత్ర : నష్టాల నుంచి భారీ లాభాలతో ముగింపు | Nifty Above 19,450, Sensex Gains 138 Pts | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : నష్టాల నుంచి భారీ లాభాలతో ముగింపు

Aug 16 2023 4:55 PM | Updated on Aug 16 2023 5:00 PM

Nifty Above 19,450, Sensex Gains 138 Pts - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లలో మెటల్‌, బ్యాంకులు మినహాయించి అన్ని రంగాలలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో బుధవారం నష్టాల నుంచి గరిష్ట లాభాలతో మార్కెట్లు ముగిశాయి.  

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్ 137.50 పాయింట్లు 65,539.42 వద్ద, నిఫ్టీ 30.50 పాయింట్లు పెరిగి 19,465 వద్ద ఉన్నాయి.

అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్‌ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభయ్యాయి. అలా ప్రారంభమైన గంట వ్యవధిలో పుంజుకున్నాయి. అయితే  వెంటనే లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ చివరి గంట కొనుగోళ్లతో సూచీలు లాభాలతో గరిష్ట స్థాయికి చేరుకొని ముగింపు పలికాయి. 

నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్స్, ఎన్‌టిపిసి, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్లాభపడగా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, భారతీ ఎయిర్‌టెల్ నష్టపోయాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి..

Advertisement
 
Advertisement
Advertisement