మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల ధరల పెంపు | Mercedes-Benz India to hike prices from 1 January 2024 | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల ధరల పెంపు

Dec 14 2023 6:29 AM | Updated on Dec 14 2023 6:29 AM

Mercedes-Benz India to hike prices from 1 January 2024 - Sakshi

న్యూఢిల్లీ: మెర్సిడెస్‌ బెంజ్‌ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్‌పుట్‌ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.

సీ–క్లాస్‌ కారుపై  రూ.60,000 నుంచి, టాప్‌ ఎండ్‌ మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ ఎస్‌680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఏ–క్లాస్‌ సెడాన్‌ నుంచి ఎస్‌యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement