సెకనుకు మూడు వాహనాలు డెలివరీ | Maruti Suzuki hit a historic milestone on servicing | Sakshi
Sakshi News home page

సెకనుకు మూడు వాహనాలు డెలివరీ

Jun 26 2025 8:38 PM | Updated on Jun 26 2025 9:08 PM

Maruti Suzuki hit a historic milestone on servicing

మారుతీ సుజు​కీ ఇండియా లిమిటెడ్ 2025 మే నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలను సర్వీస్‌ అందించడం ద్వారా అమ్మకాల అనంతరం చేసిన సర్వీస్‌లో రికార్డు నెలకొల్పింది. మే నెలలో దేశవ్యాప్తంగా మారుతీ సుజు​కీ నిమిషానికి 170 వాహనాలను సర్వీస్ చేసి డెలివరీ చేసింది. అంటే సెకనుకు దాదాపు మూడు వాహనాలను డెలివరీ చేసినట్లయింది.

ఈ విజయం మారుతీ సుజు​కీ విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని హైలైట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,400కుపైగా సర్వీసు సెంటర్లున్నాయని సంస్థ పేర్కొంది. తాజా రికార్డులో భాగంగా పెయిడ్ సేవలు, ఉచిత సేవలు, రన్నింగ్ రిపేర్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..

ఈ సందర్భంగా మారుతీ సుజు​కీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేచి మాట్లాడుతూ ‘కంపెనీ చరిత్రలో ఒక నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలకు సర్వీస్ చేయడం ఇదే మొదటిసారి. ఇది సర్వీస్ నెట్‌వర్క్‌ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా మా సేవా బృందాలు, డీలర్ భాగస్వాముల అవిశ్రాంత కృషి ఫలితమిది’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement