ఒక అరటి పండు ధర రూ.565! | Istanbul Airport The World Most Expensive Travel Hub | Sakshi
Sakshi News home page

ఒక అరటి పండు ధర రూ.565!

May 1 2025 2:48 PM | Updated on May 1 2025 4:00 PM

Istanbul Airport The World Most Expensive Travel Hub

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసులు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లలో వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఈమేరకు వాటి ధరలను హైలైట్ చేస్తూ ప్రయాణికులు సోషల్ మీడియాలో వివరాలు షేర్ చేస్తున్నారు.

ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్క అరటిపండు ధర రూపాయిల్లో రూ.565, ఒక బీరు రూ.1,697, ఫుల్‌ మీల్స్‌ భోజనంకు రూ.2,000 తీసుకుంటున్నారు. ఈ రేట్లు గమనించిన ప్రయాణికులు ఇస్తాంబుల్‌ విమానాశ్రయాన్ని ‘ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎయిర్‌పోర్ట్‌’గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా సరసమైన భోజనానికి ప్రసిద్ధి చెందిన మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్.. వంటి ఫాస్ట్ ఫుడ్ స్టోర్స్‌లో కూడా ప్రీమియం ధరలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి: పూర్తి కోడింగ్‌ పనంతా ఏఐదే!

ఇస్తాంబుల్ విమానాశ్రయం రోజూ 2,20,000 మందికిపైగా ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో ఒకటిగా ఉంది. అక్కడ ఆకట్టుకునే మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సర్వీసులు అందిస్తున్నప్పటికీ ఆహార ధరలు చాలా మందికి మింగుడుపడడం లేదు. భోజన ధరలు సాపేక్షంగా సహేతుకంగా ఉన్న ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోలిస్తే ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement