జమ్ముకశ్మీర్: శ్రీనగర్ ఎయిర్‌పోర్టువద్ద షాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నారనే నెపంతో ఒక అమెరికా దేశస్థునితో పాటు కోల్‌కతాకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు.
పోలీసుల విచారణలో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న వారిలో ఒకరు అమెరికాకు చెందిన జేప్రీ స్కాట్ ప్రాథర్‌గా గుర్తించారు. మరోకరు కోల్‌కతా నివాసైన హల్దార్ కౌశిక్‌గా తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రాంతం పాకిస్థాన్‌కు సరిహద్దుల్లో ఉండడం ఉగ్రవాద ముప్పు పొంచి ఉండడంతో భద్రతా బలగాలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా విచారణ చేపడుతున్నాయి. దానిని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
శాటిలైట్ ఫోన్ అంటే ఏమిటి?
మనం సాధారణంగా వాడే మెుబైల్‌ఫోన్ సిగ్నల్స్ భూమిపై ఉండే సెల్ టవర్ల (సెల్ టవర్స్) మీద ఆధారపడతాయి. ఒకవేళ మీరు టవర్లు లేని అడవిలోనో లేదా సముద్రం మధ్యలోనో ఉంటే సాధారణ ఫోన్‌లకు సిగ్నల్ రాదు. కానీ, శాటిలైట్ ఫోన్ నేరుగా ఆకాశంలోని ఉపగ్రహంతో నేరుగా అనుసంధానించబడి ఉంటుంది కనుక దీనికి ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. సాధారణంగా మిలిటరీ యుద్ధ సమయాల్లో లేదా మారుమూల ప్రాంతాల సమాచార మార్పిడి కోసం దీనిని ఉపయోగిస్తారు. పర్వతారోహకులు ఎవరెస్ట్ వంటి శిఖరాలు అధిరోహించేటప్పుడు లేదా దట్టమైన అడవుల్లోకి వెళ్ళినప్పుడు దీనిని అధికంగా వాడుతుంటారు.
ఎందుకు నిషేదం
అయితే వీటిని ట్రాక్ చేయడం చాలా కష్టమైన పని కనుక భారత్‌లో వీటి వాడకంపై నిషేదం విధించారు. ఒకవేళ ఎవరైనా దానిని వాడాలంటే టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశీయులు దానిని తీసుకరావాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


