లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగాల్లో అవకాశాలు అపారం : ప‌ల్స‌స్ సీఈవో | Infusing Engineering, Soft Skills Key For Life Sciences, Pharmacy Growth Said Srinubabu Gedela | Sakshi
Sakshi News home page

లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగాల్లో అవకాశాలు అపారం : ప‌ల్స‌స్ సీఈవో

Dec 4 2023 7:44 PM | Updated on Dec 4 2023 8:09 PM

Infusing Engineering, Soft Skills Key For Life Sciences, Pharmacy Growth Said Srinubabu Gedela - Sakshi

లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగాల్లో ఇన్ఫ్యూజన్‌ ఇంజినీరింగ్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ ప్రముఖ పాత్ర పోషిస్తాయని ప‌ల్స‌స్ సీఈవో డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, ఇంజనీరింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లోని అవకాశాలపై  చర్చించేందుకు రఘు ఫార్మసీ కాలేజీ, ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ డీన్‌లు, విద్యార్థులు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా  లైఫ్ సైన్సెస్, ఫార్మసీ, ఇంజనీరింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లో ప్రావిణ్యాల్ని పెంపొందించుకోవాలని తెలిపారు. తద్వారా అవకాశాల్ని అందింపుచ్చుకోవచ్చన్నారు. టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న గణణీయమైన మార్పులపై దృష్టిసారించాలని .. ఫార్మాస్యూటికల్స్ , ఏఐ వ్యాప్తి, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాల గురించి హైలైట్ చేశారు.

 ఇంజినీరింగ్ టెక్నిక్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఇండియా, ఫార్మాస్యూటికల్ ఇన్నోవేషన్‌లు,  ఉపాధి, గ్లోబల్ హెల్త్‌కేర్ సపోర్ట్ విభాగంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఖరీదైన మెడిసిన్‌ తయారు చేయడం ఖర్చతో కూడుకుంది. అయినప్పటికీ భారత్‌ ఫార్మా రంగంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement