గంటల వ్యవధిలో.. మారిపోయిన బంగారం ధరలు! | Gold Prices Drop Again Check Latest Rates in Your City | Sakshi
Sakshi News home page

గంటల వ్యవధిలో.. మారిపోయిన బంగారం ధరలు!

Jun 23 2026 9:14 PM | Updated on Jun 23 2026 9:18 PM

Gold Prices Drop Again Check Latest Rates in Your City

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 24 గంటలు గడవక ముందే.. గోల్డ్ రేటు భారీ పతనం చవి చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు సంభవించింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు ఉదయం రూ.1900 (22 క్యారెట్స్ తులం), రూ.2070 (24 క్యారెట్స్ తులం) తగ్గి వరుసగా రూ. 133750, రూ.145910 వద్ద నిలిచిన 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రాని మరోమారు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం పసిడి ధరలు రూ.132500, రూ.144600 వద్దకు చేరాయి. దీన్నిబట్టి చూస్తే బంగారం ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టమవుతోంది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3100 రూపాయలు తగ్గి రూ.132700 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3380 రూపాయలు తగ్గి రూ.144750 వద్దకు చేరాయి.

చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో సాయంత్రానికి ఏ మాత్రం మార్పు చెందలేదు. కాబట్టి ఇక్కడ తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 147930 రూపాయల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.135600 వద్ద ఉంది.

ఇదీ చదవండి: డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement