జులైలో 3.27 లక్షల వాహన అమ్మకాలు
ఫాడా వెల్లడి
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. జులైలో మరోసారి రికార్డు సృష్టించాయి. ఏకంగా 3,27,901 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైతో పోలిస్తే ఇది 66 వృద్ధి. ప్రస్తుతం రిటైల్ విక్రయాల్లో ప్రతి ఎనిమిది వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం ఉంటోందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లోనే 63 శాతం వృద్ధితో 3,06,220 యూనిట్ల విక్రయాలతో రికార్డు నమోదైంది. దీనితో మొత్తం ఈవీల వినియోగం తొలిసారిగా 12 శాతాన్ని దాటింది.
జులైలో ద్విచక్ర ఈవీల అమ్మకాలు గతేడాది జూలైలో నమోదైన 1,08,516 యూనిట్ల నుంచి 88 శాతం ఎగిసి 2,04,362 యూనిట్లకు పెరిగాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 32 శాతం వృద్ధితో 17,981 యూనిట్ల నుంచి 87,055 యూనిట్లకు చేరాయి. ఇక వాణిజ్య వాహనాల అమ్మకాలు 169 శాతం ఎగిసి 1,324 యూనిట్ల నుంచి 3,556 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించడం నుంచి కొనుగో లు చేసే వైపుగా వినియోగదారులు మళ్లుతున్నారని ఫాడా వైస్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ తెలిపారు. అత్యధిక డిమాండ్ ఉన్న మోడల్స్ సరఫరా కొరత ప్రతిబంధకంగా ఉంటోందని, లేకపోతే అమ్మకాలు మరింతగా పెరుగుతాయని చెప్పారు. పండుగ సీజన్‌కి ముందుగా సరఫరాను పెంచే దిశగా తయారీ సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ20 పెట్రోల్ నాణ్యమైనదే: ఆయిల్ కంపెనీలు
ఈ20 పెట్రోల్‌లో అధిక తేమ, క్లోరైడ్ ఉంటున్నాయన్న ఆరోపణలు నిరాధారమైనవని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిర్వహించిన పరీక్షల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని పేర్కొన్నాయి. మొత్తం సరఫరా వ్యవస్థవ్యాప్తంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు లోబడే ఈ20 పెట్రోల్ ఉందని తెలిపాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశాయి. రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెరి్మనల్స్, రిటైల్ ఔట్‌లెట్స్‌లో పర్యవేక్షణను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోందని వివరించాయి. నీరు చొరబడటం, సాంద్రతకు సంబంధించి ప్రతి బంకులోనూ రోజుకు 8–12 సార్లు పరీక్షలు చేస్తూ, నాణ్యతపై పర్యవేక్షణను కఠినతరం చేసినట్లు ఓఎంసీలు తెలిపాయి.
ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు


