అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026: డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వివరాలు | Amazon Great Freedom Sale 2026 Date, Bank Offers, Top Deals, Massive Discounts on Smartphones, Electronics & More | Sakshi
Sakshi News home page

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026: డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే

Jul 30 2026 8:12 PM | Updated on Jul 30 2026 8:28 PM

Amazon Great Freedom Sale 2026 Date and Discounts Details

ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి కోసం అమెజాన్ ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ వస్తువులు, గ్రాసరీ వంటి ఎన్నో విభాగాల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

ఈసారి సేల్‌లో కస్టమర్ల కోసం టాప్ 100 డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, 8 పీఎం డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్లను అమెజాన్ తీసుకొస్తోంది. దీంతో పాటు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది. అంతే కాకుండా.. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో పాటు రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ పొందే సదుపాయం కూడా ఉంది.

డిస్కౌంట్లతో పాటు కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు అమెజాన్ పలు ఆఫర్లను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, అమెజాన్ పే రివార్డ్స్ ద్వారా కొనుగోళ్లను మరింత చౌకగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పిన్‌కోడ్లలో వేగవంతమైన డెలివరీ సదుపాయం కల్పించనున్నట్లు అమెజాన్ తెలిపింది.

ఈసారి అమెజాన్ సేల్‌లో ఏఐ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కస్టమర్లకు సరైన ఉత్పత్తిని కనుగొనడంలో సహాయపడేందుకు రూఫస్ ఏఐ షాపింగ్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువు గురించి సాధారణ భాషలో అడిగితే, దానికి సరిపోయే ఉత్పత్తులను రూఫస్ సూచిస్తుంది. లెన్స్ ఏఐ ద్వారా ఫొటో తీసి లేదా అప్‌లోడ్ చేసి నచ్చిన వస్తువులను సులభంగా వెతకవచ్చు.

ఒక ఉత్పత్తి ధర ఎప్పుడు తగ్గిందో తెలుసుకునేందుకు 30 నుంచి 90 రోజుల ప్రైస్ హిస్టరీ ట్రాకర్ సదుపాయం కూడా ఉంటుంది. ధర మనకు అనుకూలంగా మారినప్పుడు కొనుగోలు చేయడానికి అలర్ట్స్ పంపుతుంది. ఒక వస్తువు కొనుగోలు చేసే ముందు రివ్యూలు చదవడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. దీనిని సులభతరం చేసేందుకు ఏఐ రివ్యూ హైలైట్స్ ఫీచర్ ద్వారా ముఖ్యమైన అంశాలను సంక్షిప్తంగా చూపిస్తుంది. దీంతో కస్టమర్లు సరైన నిర్ణయం తీసుకోవడం మరింత సులభం అవుతుంది.

అమెజాన్ పే ఉపయోగించే వారికి కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న ప్రైమ్ సభ్యులు 5 శాతం, ఇతర సభ్యులు 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అర్హత ఉన్న వినియోగదారులు అమెజాన్ పే లేటర్ ద్వారా రూ.60,000 వరకు క్రెడిట్ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, అప్లయెన్సెస్ వంటి ఉత్పత్తులను సులభమైన ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. రూ.1,500 కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లను మూడు నెలల పాటు వడ్డీ లేకుండా విడతలుగా చెల్లించే సదుపాయం కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement