breaking news
Freedom Sale
-
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026: డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వివరాలు
ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి కోసం అమెజాన్ ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ వస్తువులు, గ్రాసరీ వంటి ఎన్నో విభాగాల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.ఈసారి సేల్‌లో కస్టమర్ల కోసం టాప్ 100 డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, 8 పీఎం డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్లను అమెజాన్ తీసుకొస్తోంది. దీంతో పాటు.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది. అంతే కాకుండా.. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో పాటు రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ పొందే సదుపాయం కూడా ఉంది.డిస్కౌంట్లతో పాటు కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు అమెజాన్ పలు ఆఫర్లను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, అమెజాన్ పే రివార్డ్స్ ద్వారా కొనుగోళ్లను మరింత చౌకగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పిన్కోడ్లలో వేగవంతమైన డెలివరీ సదుపాయం కల్పించనున్నట్లు అమెజాన్ తెలిపింది.ఈసారి అమెజాన్ సేల్‌లో ఏఐ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కస్టమర్లకు సరైన ఉత్పత్తిని కనుగొనడంలో సహాయపడేందుకు రూఫస్ ఏఐ షాపింగ్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువు గురించి సాధారణ భాషలో అడిగితే, దానికి సరిపోయే ఉత్పత్తులను రూఫస్ సూచిస్తుంది. లెన్స్ ఏఐ ద్వారా ఫొటో తీసి లేదా అప్లోడ్ చేసి నచ్చిన వస్తువులను సులభంగా వెతకవచ్చు.ఒక ఉత్పత్తి ధర ఎప్పుడు తగ్గిందో తెలుసుకునేందుకు 30 నుంచి 90 రోజుల ప్రైస్ హిస్టరీ ట్రాకర్ సదుపాయం కూడా ఉంటుంది. ధర మనకు అనుకూలంగా మారినప్పుడు కొనుగోలు చేయడానికి అలర్ట్స్ పంపుతుంది. ఒక వస్తువు కొనుగోలు చేసే ముందు రివ్యూలు చదవడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. దీనిని సులభతరం చేసేందుకు ఏఐ రివ్యూ హైలైట్స్ ఫీచర్ ద్వారా ముఖ్యమైన అంశాలను సంక్షిప్తంగా చూపిస్తుంది. దీంతో కస్టమర్లు సరైన నిర్ణయం తీసుకోవడం మరింత సులభం అవుతుంది.అమెజాన్ పే ఉపయోగించే వారికి కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న ప్రైమ్ సభ్యులు 5 శాతం, ఇతర సభ్యులు 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అర్హత ఉన్న వినియోగదారులు అమెజాన్ పే లేటర్ ద్వారా రూ.60,000 వరకు క్రెడిట్ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, అప్లయెన్సెస్ వంటి ఉత్పత్తులను సులభమైన ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. రూ.1,500 కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లను మూడు నెలల పాటు వడ్డీ లేకుండా విడతలుగా చెల్లించే సదుపాయం కూడా ఉంది. -
‘ఫ్రీడమ్’ ఆఫర్.. బస్ టికెట్ ధరతో ఫ్లైట్ జర్నీ
తక్కువ ధరకు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అది కూడా బస్ టికెట్ ధరకే. ఈ సూపర్ ఆఫర్‌ను టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ కంపెనీ 'విస్తారా' తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకుంటే రూ.1,578లకే ఎంచక్కా ఫ్లైట్ ఎక్కేయచ్చు.ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా నవరాత్రి, దసరా వరకు ప్రయాణించవచ్చు. అయితే దీని కోసం ఆగస్టు 15లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్ విస్తారా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో అక్టోబర్ 31 నుంచి ఆగస్టు 15 వరకు చౌకగా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.ఈ మార్గంలో రూ.1578విస్తారా సేల్‌లో బాగ్డోగ్రా నుంచి డిబ్రూగఢ్‌కు ప్రయాణించడానికి ఎకానమీ క్లాస్‌లో ఒకవైపు దేశీయ ఛార్జీ రూ.1,578 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ముంబై నుంచి అహ్మదాబాద్‌కి ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రారంభ ధర రూ.2,678. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్‌కి బిజినెస్ క్లాస్ ధర రూ.9,978 నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి ఖాట్మండుకు అంతర్జాతీయ విమానానికి ఎకానమీ క్లాస్ ధర రూ.11,978 నుంచి ప్రారంభమవుతుంది. అదే ప్రీమియం ఎకానమీ విభాగంలో ఢిల్లీ నుంచి ఖాట్మండుకు ప్రారంభ ధర రూ.13,978. -
జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్
న్యూఢిల్లీ: వినియోగదారులకు కోసం టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్రీడం ఆఫర్‌ను లాంచ్ చేసింది. రూ. 2,999 ల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఇందులో అపరిమిత కాలింగ్, 365 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. (Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?) రూ. 2,999 ల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్, ఆఫర్లు 75 జీబీ అదనపు డేటా ప్రయోజనం ఏడాది డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ జియో సెక్యూరిటీ జియో సినిమా JioTV JioCloud అజియోపై రూ. 750 తగ్గింపు నెట్‌మెడ్స్‌పై రూ. 750 తగ్గింపు ఇక్సిగోపై రూ.750 తగ్గింపు ఇది కూడా చదవండి: CAG Report: 21వేల ట్రస్టులకు కోట్లాది రూపాయల టాక్స్ మినహాయింపులు -
ఫ్రీడం సేల్ : వెయ్యికే విమాన ప్రయాణం
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లతో అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ను ప్రకటించగా.. తాజాగా విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా ‘ఫ్రీడం సేల్’ను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ఈ సేల్ కింద విమాన టిక్కెట్ కేవలం రూ.1,099కే లభ్యమవుతుంది. ఈ కొత్త సేల్ ఆఫర్ బుకింగ్స్ ఆగస్టు 14వ తేదీ 00:01 am నుంచి ప్రారంభమై, 11:59 pm వరకు కొనసాగనున్నాయి. ఎస్బీఐ కార్డుద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ కస్టమర్లు 2018 ఆగస్టు 22 నుంచి 2018 అక్టోబర్ 10 వరకు ప్రయాణించవచ్చు. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్లాస్ కస్టమర్లు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు ట్రావెల్ చేయొచ్చు. ఎకానమీ లైట్ కేటగిరీ వారికి వన్-వే ధరలు కేవలం రూ.1,099కే అందుబాటులో ఉన్నాయి. ఎకానమీ స్టాండర్డ్ కేటగిరీ వారికి రూ.1,399కు, ప్రీమియం ఎకానమీ కేటగిరీ వారికి రూ.2,499, బిజినెస్ క్లాస్ కేటగిరీ వారికి రూ.6,099కు విమాన టిక్కెట్లను విస్తారా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద సీట్లు పరిమితం. ఫస్ట్-కమ్-ఫస్ట్ సర్వ్ బేసిస్‌లోనే ఈ సీట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలోనే అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వన్-వే విమాన టిక్కెట్ ధర ఎకానమీ లైట్ కేటగిరీ కింద రూ.1,799 కాగ, ఎకానమీ స్టాండర్డ్ కింద 2,324 రూపాయలు, ప్రీమియం ఎకానమీ కింద 4,199 రూపాయలు, బిజినెస్ క్లాస్ కింద 15,999 రూపాయలుగా ఉంది. మిగతా రూట్ల ధరలను www.airvistara.com లో చూడవచ్చు.


