breaking news
EV
-
టాటా కార్లు.. భారీ తగ్గింపు ఆఫర్లు
కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ ఆగస్టు నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు ఎలక్ట్రిక్ కార్లపైనా నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, లాయల్టీ బెనిఫిట్, ‘ఫ్రీడమ్ సెలబ్రేషన్’ ఆఫర్లను కలిపి అందిస్తోంది. ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ మోడళ్లపై గరిష్ఠ ప్రయోజనం రూ.3.35 లక్షల వరకు ఉంది. వేరియంట్, మోడల్ ఇయర్, పాత కారు ఎక్స్ఛేంజ్, లాయల్టీ అర్హత వంటి అంశాలపై తుది ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.టియాగో, టిగోర్‌పై ఆఫర్లుకొత్తగా వచ్చిన టియాగో ఫేస్‌లిఫ్ట్‌పై అధికారిక తగ్గింపులు లేవు. అయితే, మిగిలిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో స్టాక్‌పై ఎంపిక చేసిన వేరియంట్లకు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, ఫ్రీడమ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గరిష్ఠ ప్రయోజనం సుమారు రూ.35,000 వరకు ఉంటుంది. టిగోర్‌పై కూడా రూ.30,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.టియాగో ఈవీపై రూ.1.45 లక్షల వరకుప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో ఈవీపై మాత్రం గణనీయమైన ప్రయోజనాలు కొనసాగుతున్నాయి. ఎంపిక చేసిన లాంగ్ రేంజ్ XT వేరియంట్‌పై నగదు, ఫ్రీడమ్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలను కలిపి గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. ఇతర టియాగో ఈవీ వేరియంట్లపై కూడా రూ.65,000 నుంచి రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి.ఆల్ట్రోజ్‌పై రూ.45,000 వరకుఆల్ట్రోజ్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలను కలిపి రూ.45,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. డీజిల్ వేరియంట్లపై గరిష్ఠ ప్రయోజనం రూ.40,000 వరకు ఉంది.పంచ్ ఈవీపై రూ.1.45 లక్షల వరకుసాధారణ పంచ్‌పై ఈ నెలలో పెద్దగా అధికారిక తగ్గింపులు లేవు. అయితే, పంచ్ ఈవీపై ఎంపిక చేసిన వేరియంట్లకు భారీ ప్రయోజనాలు ఉన్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లపై నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ కలిపి గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు, స్మార్ట్ వేరియంట్లపై రూ.95,000 వరకు బెనిఫిట్ ఉంది.నెక్సాన్‌పై రూ.55,000 వరకునెక్సాన్ పెట్రోల్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.45,000 వరకు, సీఎన్జీ మోడళ్లపై రూ.55,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. డీజిల్ వేరియంట్లపై మాత్రం ప్రధానంగా ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలే ఉండటంతో గరిష్ఠ బెనిఫిట్ రూ.20,000 వరకు ఉంది. నెక్సాన్ ఈవీపై గరిష్ఠ ప్రయోజనం రూ.45,000 వరకు ఉంది. ఇందులో నగదు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉంటాయి.కర్వ్‌పై భారీ డీల్.. ఈవీపై మరింత ఎక్కువటాటా కర్వ్ ఐసీఈపై ఈ నెలలో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.45,000 స్క్రాపేజ్ ప్రయోజనం, అర్హత ఉన్నవారికి రూ.50,000 లాయల్టీ బెనిఫిట్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది.అయితే అసలు హైలైట్ కర్వ్ ఈవీ. ఎంపిక చేసిన వేరియంట్లపై నగదు తగ్గింపు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండటంతోపాటు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీంతో గరిష్ఠ ప్రయోజనం రూ.3.35 లక్షల వరకు చేరుతోంది. అందువల్ల ఆగస్టులో టాటా కార్లలో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్‌గా కర్వ్ ఈవీ నిలిచింది.హారియర్, సఫారీపై రూ.45,000 వరకుహారియర్, సఫారీ డీజిల్ మోడళ్లపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉన్నాయి. అర్హతలను బట్టి గరిష్ఠ ప్రయోజనం రూ.45,000 వరకు ఉంటుంది.హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకుహారియర్ ఈవీపై మాత్రం మరింత భారీ ఆఫర్ ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.75,000 నుంచి రూ.1 లక్ష వరకు ఫ్రీడమ్ సెలబ్రేషన్ ఆఫర్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.75,000 స్క్రాపేజ్ ప్రయోజనం లభిస్తాయి. ఇప్పటికే టాటా ఈవీ లేదా ఐసీఈ వాహనం కలిగి ఉన్న అర్హతగల కస్టమర్లకు లాయల్టీ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. మొత్తం ప్రయోజనం గరిష్ఠంగా రూ.2.75 లక్షల వరకు చేరవచ్చు.సియెర్రాపై పరిమిత ఆఫర్లుకొత్తగా మార్కెట్లోకి వచ్చిన సియెర్రాపై డిస్కౌంట్లు పరిమితంగానే ఉన్నాయి. ఎంపిక చేసిన సియెర్రా డీజిల్ వేరియంట్లపై స్క్రాపేజ్, లాయల్టీ లేదా ఇతర అర్హత ఆధారిత ప్రయోజనాలతో సుమారు రూ.30,000 వరకు బెనిఫిట్ లభిస్తోంది. సియెర్రా ఈవీపై ప్రస్తుతం అధికారిక వినియోగదారుల తగ్గింపు ప్రకటించలేదు.ఈ ఆఫర్లు ఆగస్టు 31, 2026 వరకు లేదా సంబంధిత స్టాక్ ఉన్నంతవరకు వర్తించే అవకాశం ఉంది. నగరం, డీలర్, వేరియంట్, మోడల్ ఇయర్, స్టాక్ లభ్యత, కస్టమర్ అర్హతను బట్టి తుది మొత్తం మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు సమీప టాటా మోటార్స్ డీలర్షిప్ వద్ద తాజా ఆఫర్, డిస్కౌంట్ బ్రేకప్, ఎక్స్‌షోరూమ్ ధరను నిర్ధారించుకోవడం మంచిది.ఇదీ చదవండి: హ్యుందాయ్ కార్ల ధరల పెంపు -
కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్‌న్యూస్!
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఇచ్చే సబ్సిడీని 2028 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించింది.నిజానికి ఈ సబ్సిడీ గడువు 2026 ఆర్థిక సంవత్సరంతో ముగియాల్సి ఉండగా, మరో రెండేళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించనుంది.పెరిగిన బడ్జెట్ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే?.. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం కేటాయించిన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. ఇదివరకు దీనికోసం రూ.1,772 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. ఇప్పుడు దీనిని రూ.2,767 కోట్లకు పెంచింది. అంతే కాకుండా.. సబ్సిడీ పొందే వాహనాల సంఖ్యను 24 లక్షల నుంచి 45.7 లక్షలకు పెంచారు.ఎలక్ట్రిక్ టూ-వీలర్‌కు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్‌కు రూ. 2,500 సబ్సిడీ లభిస్తుంది. గరిష్ఠంగా రూ.5,000 వరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ సబ్సిడీని క్లెయిమ్ చేసుకునే చివరి తేదీ 2027 డిసెంబర్ 31గా నిర్ణయించారు.పెరుగుతున్న ఈవీ సేల్స్దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2021-22లో సుమారు 2.53 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడవగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 14.6 లక్షలకు చేరింది. మరోవైపు పెట్రోల్ టూ-వీలర్ల అమ్మకాలు కొంత తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం వల్ల పెట్రోల్ ఖర్చు తగ్గడంతో పాటు, దేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా టూ-వీలర్లు దేశంలో పెద్ద మొత్తంలో పెట్రోల్ వినియోగిస్తున్నందున, ఈ మార్పు ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వల్ల కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. మరోవైపు సబ్సిడీని 2028 వరకు కొనసాగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు కూడా భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుంది. దీంతో కంపెనీలు పెట్టుబడులు పెంచి ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులతో పాటు దేశంలో ఈవీ మార్కెట్‌కు కూడా ఊతమిచ్చే అవకాశం ఉంది. -
ఈవీలను తెగబడి కొంటున్నారు!
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. జులైలో మరోసారి రికార్డు సృష్టించాయి. ఏకంగా 3,27,901 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైతో పోలిస్తే ఇది 66 వృద్ధి. ప్రస్తుతం రిటైల్ విక్రయాల్లో ప్రతి ఎనిమిది వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం ఉంటోందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లోనే 63 శాతం వృద్ధితో 3,06,220 యూనిట్ల విక్రయాలతో రికార్డు నమోదైంది. దీనితో మొత్తం ఈవీల వినియోగం తొలిసారిగా 12 శాతాన్ని దాటింది.జులైలో ద్విచక్ర ఈవీల అమ్మకాలు గతేడాది జూలైలో నమోదైన 1,08,516 యూనిట్ల నుంచి 88 శాతం ఎగిసి 2,04,362 యూనిట్లకు పెరిగాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 32 శాతం వృద్ధితో 17,981 యూనిట్ల నుంచి 87,055 యూనిట్లకు చేరాయి. ఇక వాణిజ్య వాహనాల అమ్మకాలు 169 శాతం ఎగిసి 1,324 యూనిట్ల నుంచి 3,556 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించడం నుంచి కొనుగో లు చేసే వైపుగా వినియోగదారులు మళ్లుతున్నారని ఫాడా వైస్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ తెలిపారు. అత్యధిక డిమాండ్ ఉన్న మోడల్స్ సరఫరా కొరత ప్రతిబంధకంగా ఉంటోందని, లేకపోతే అమ్మకాలు మరింతగా పెరుగుతాయని చెప్పారు. పండుగ సీజన్‌కి ముందుగా సరఫరాను పెంచే దిశగా తయారీ సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ20 పెట్రోల్ నాణ్యమైనదే: ఆయిల్ కంపెనీలుఈ20 పెట్రోల్‌లో అధిక తేమ, క్లోరైడ్ ఉంటున్నాయన్న ఆరోపణలు నిరాధారమైనవని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిర్వహించిన పరీక్షల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని పేర్కొన్నాయి. మొత్తం సరఫరా వ్యవస్థవ్యాప్తంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు లోబడే ఈ20 పెట్రోల్ ఉందని తెలిపాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశాయి. రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెరి్మనల్స్, రిటైల్ ఔట్‌లెట్స్‌లో పర్యవేక్షణను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోందని వివరించాయి. నీరు చొరబడటం, సాంద్రతకు సంబంధించి ప్రతి బంకులోనూ రోజుకు 8–12 సార్లు పరీక్షలు చేస్తూ, నాణ్యతపై పర్యవేక్షణను కఠినతరం చేసినట్లు ఓఎంసీలు తెలిపాయి.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
రోడ్లపైకి 4 వేల పైగా ఎలక్ట్రిక్ బస్సులు..
దేశీయంగా 4,000 ఎలక్ట్రిక్ బస్సులను రహదార్లపైకి తెచ్చిన తొలి భారతీయ సంస్థగా ఘనత సాధించినట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ వెల్లడించింది. హిమాచల్ రోడ్డు రవాణా కార్పొరేషన్‌కి 4,000వ బస్సును లాంఛనంగా అందజేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వివరించింది. ఇది కంపెనీకే కాకుండా భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి కూడా కీలక సందర్భమని కంపెనీ ఎండీ మహేష్ బాబు చెప్పారు.విశ్వసనీయమైన పనితీరు, తక్కువ నిర్వహణ వ్యయాలు, పర్యావరణానికి గణనీయంగా ప్రయోజనాలను అందించేలా తమ బస్సులు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ బస్సులు మొత్తం మీద 730 మిలియన్ గ్రీన్ కిలోమీటర్ల మేర ప్రయాణం చేశాయని, 6.5 లక్షల టన్నులపైగా కర్బన ఉద్గారాలను నివారించాయని కంపెనీ పేర్కొంది. -
ఎలక్ట్రిక్ టూ-వీలర్ల జోరుతో ఈవీలు.. రయ్ రయ్!
ముంబై: భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగం విస్తృత వృద్ధి దశలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా (పెనెట్రేషన్) 10 నుంచి 12 శాతానికి పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) అంచనా వేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఈ వృద్ధికి ప్రధాన దన్నుగా నిలుస్తాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 8.5 శాతంగా నమోదైంది. ఇండ్–రా నివేదిక ప్రకారం విభాగాల వారీగా ఈవీ వాటా అంచనాలు ఇలా ఉన్నాయి. తక్కువ నిర్వహణ వ్యయం, ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యం, దిగ్గజ ఆటో కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుండటంతో ద్విచక్ర వాహన విభాగంలో ఈవీల వాటా గతేడాది 6.6 శాతం నుంచి ఈ ఏడాది 8–10 శాతానికి పెరగొచ్చని అంచనా. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విభాగంలో ఈవీల ఆధిపత్యం కొనసాగనుంది. గతేడాది (2025–26) మొత్తం త్రిచక్ర వాహన విక్రయాల్లో ఈవీల వాటా 59 శాతంగా ఉంది. కమర్షియల్ ఆపరేటర్లకు అనుకూలమైన నిర్వహణ వ్యయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 62–65 శాతానికి చేరొచ్చు. కొత్త మోడళ్ల విడుదలతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా గతేడాది 4.4 శాతం నుంచి ఈ ఏడాది 6–8 శాతానికి పెరగొచ్చు. మెట్రో నగరాలు, అధిక ఆదాయ వర్గాల్లో వీటి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే అధిక ప్రారంభ కొనుగోలు ధర, చార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత, ఒక్కసారి చార్జింగ్‌తో ప్రయాణించగల దూరం (రేంజ్) వంటి అంశాలు ఈ విభాగంలో వేగవంతమైన విస్తరణకు సవాళ్లుగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) వాటా కూడా గతేడాది 4.37 శాతం నుంచి ఈ ఏడాది 6–8 శాతానికి చేరొచ్చు. బలమైన ఆర్డర్ బుక్, ప్రభుత్వ కొనుగోలు కార్యక్రమాలు ఇందుకు దోహదపడనున్నాయి. అయితే రాష్ట్ర రవాణా సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఈ–బస్సుల విస్తరణ ఆధారపడి ఉంటుందని పేర్కొంది.బ్యాటరీల దిగుమతులు తగ్గాలి వాహన వినియోగ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, విస్తృత శ్రేణిలో కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, వినియోగదారుల ఆదరణ పెరగడంతో దేశీయ ఈవీ మార్కెట్‌కు బలమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే తదుపరి దశ వృద్ధి దేశీయ వాల్యూ చైన్ బలోపేతంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీలు, అనుబంధ సాంకేతికతల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ఈ స్థానంలో దేశీయ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనితోపాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించాల్సి ఉంది’’ అని ఇండియా రేటింగ్స్ కార్పొరేట్స్ డైరెక్టర్ శృతి సబూ పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై 50% సబ్సిడీ!
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి.. పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించదానికి గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీ కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.లైసెన్స్ పొందిన బైక్ టాక్సీ డ్రైవర్లు, ఆటోరిక్షా డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 50 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది.ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌తో నడిచే వాహనాలను ఉపయోగిస్తున్న డ్రైవర్లు.. ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది డ్రైవర్లపైన కొంత వరకు ఆర్ధిక భారం తగ్గిస్తుంది.ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద గోవాలో 70 కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనదారులకు ఛార్జింగ్ సౌకర్యం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది.ఇదీ చదవండి: పిల్లల కోసం టెస్లా బైక్.. రూ.20 వేలు మాత్రమే!అంతేకాకుండా.. పరిశ్రమలు, వాణిజ్య సంస్థల్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, సోలార్ విద్యుత్, ఇతర స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. మరోవైపు.. దాదాపు పదేళ్లుగా సేవలందిస్తున్న గోవా ప్రభుత్వ రవాణా సంస్థ కదంబ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (KTC)కు చెందిన పాత డీజిల్ బస్సులను సీఎన్జీ ఇంజిన్లతో మార్చే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది. దీని వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ మరింత పర్యావరణహితంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
దుబాయ్: వెడ్డింగ్ హాల్స్‌లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
దుబాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక అడుగు పడింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (CDA), యూఏఈ తొలి పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్వర్క్ సంస్థ UAEV (Emarat EV Charging Stations Company) వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా దుబాయ్‌లోని మజ్లిస్‌లు, కమ్యూనిటీ కౌన్సిల్స్, వెడ్డింగ్ హాల్స్ వంటి ప్రజా సదుపాయాల వద్ద దశలవారీగా ఆధునిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యతో నివాసితులు, సందర్శకులకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత సులభతరం కానుంది.ఈ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అల్ రషీదియా మజ్లిస్, అల్ బర్షా మజ్లిస్, నాద్ అల్ షెబా మజ్లిస్లలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 2026లో అల్ ఖవానీజ్ మజ్లిస్, అల్ వార్కా మజ్లిస్, అల్ బర్షా వెడ్డింగ్ హాల్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. అనంతరం 2027లో అల్ త్వార్ వెడ్డింగ్ హాల్, అల్ అవిర్ మజ్లిస్, హట్టా మజ్లిస్ల వరకు ఈ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు.ఈ ప్రాజెక్టు యూఏఈ నెట్ జీరో 2050 వ్యూహం, దుబాయ్ సోషల్ అజెండా 33 లక్ష్యాలకు అనుగుణంగా అమలు కానుంది. అలాగే 2030 నాటికి దేశవ్యాప్తంగా 1,000కిపైగా హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్న యూఏఈవీ లక్ష్యానికి కూడా ఇది బలాన్నిస్తుంది. ఇటీవల మసీదుల పార్కింగ్ ప్రాంగణాల్లో కూడా ఇదే తరహా ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుకు యూఏఈవీ ఒప్పందాలు కుదుర్చుకోవడం, దుబాయ్‌లో గ్రీన్ మొబిలిటీ విస్తరణ వేగంగా సాగుతోందనే సంకేతాలను ఇస్తోంది. -
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు రూ.11 లక్షలకే..
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘క్రెటా ఎలక్ట్రిక్’ కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో బ్యాటరీ ధరను వాహనం ధర నుంచి వేరు చేయడం ద్వారా క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.10.99 లక్షలకు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానాన్ని కంపెనీ తాజాగా అధికారికంగా ప్రకటించింది.ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో అధిక ప్రారంభ వ్యయం ప్రధాన అడ్డంకిగా ఉండేది. కొత్త బాస్ మోడల్లో వినియోగదారులు కారును తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ లేదా ఈఎంఐ విధానాన్ని ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాటరీ ఈఎంఐ ఖర్చు కిలోమీటరుకు రూ.3.90 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం తగ్గి, ఈవీ యాజమాన్యం మరింత అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.ఫీచర్లలోనూ అప్డేట్బాస్ మోడల్‌తో పాటు క్రెటా ఎలక్ట్రిక్‌లో కొన్ని కొత్త ఫీచర్లను కూడా హ్యుందాయ్ జోడించింది. అన్ని సంబంధిత వేరియంట్లలో ‘ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్ స్టెప్’ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వాహనంలోకి ఎక్కడం, దిగడం మరింత సులభంగా ఉంటుంది. అలాగే వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హోమ్ ఛార్జర్ వేరియంట్లలో 7.4 కిలోవాట్ల వాల్‌బాక్స్ ఛార్జర్‌ను ప్రామాణికంగా అందిస్తోంది.రెండు బ్యాటరీ ప్యాక్‌లు.. 510 కి.మీ వరకు రేంజ్క్రెటా ఎలక్ట్రిక్‌లో 42 కిలోవాట్లు, 51.4 కిలోవాట్లు అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు కొనసాగుతున్నాయి. పెద్ద బ్యాటరీతో కూడిన లాంగ్-రేంజ్ వేరియంట్‌కు ఒకసారి పూర్తి ఛార్జ్‌తో గరిష్టంగా 510 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ (ARAI సర్టిఫైడ్) లభిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. లాంగ్-రేంజ్ వేరియంట్ 0 నుంచి 100 కిమీ వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది.ప్రీమియం టెక్నాలజీ ఫీచర్లుక్రెటా ఎలక్ట్రిక్‌లో వెహికల్-టు-లోడ్ (V2L), హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్-2 ADAS, ఐ-పెడల్ సింగిల్ పెడల్ డ్రైవింగ్, డిజిటల్ కీ, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ కూడా కంపెనీ అందిస్తోంది.ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణదేశంలో ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హ్యుందాయ్ తన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 183 ప్రాంతాల్లో 214 డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, మొత్తం 399 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే మైహ్యుందాయ్ యాప్‌లోని ఈవీ ఛార్జ్ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వినియోగదారులు గుర్తించి ఉపయోగించుకోవచ్చని తెలిపింది. -
తగ్గుతున్న పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం
సాక్షి, అమరావతి: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తగ్గుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వాహనాల (ఈవీల) వినియోగం పెరుగుతోంది. పశ్చిమాసియా సంక్షోభం భారతీయుల ప్రయాణ ప్రాధాన్యతలను మారుస్తోందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దేశంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో ఈవీల వినియోగం బాగా పెరిగిందని, ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగ వాటా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 2024లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2 శాతమే ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 8 శాతానికి పెరిగింది. 2030 నాటికి 20 శాతం వాటాను సాధించడం ద్వారా దిగుమతి బిల్లులో రూ.1 లక్ష కోట్లు ఆదా చేయవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. ఫిబ్రవరి నుంచి అన్ని రాష్ట్రాల్లోను ఈవీల వినియోగం భారీగా పెరిగిందని తెలిపింది. మన రాష్ట్రంలో 2024లో ఈవీల వాటా 1.6 శాతం ఉండగా ఈ ఏడాది ఇప్పటికే 8.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో 2024లో ఈవీ రిజిస్ట్రేషన్లు 14,605 ఉండగా 2025లో 48,935కు పెరిగాయి. 2026లో ఇప్పటికే 47,066 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈవీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయని నివేదిక తెలిపింది. 2025లో సగటున నెలకు 1.3 లక్షల ఈవీ రిజిస్ట్రేషన్లు జరగగా.. 2026 మార్చి నుంచి జూన్ మధ్య సగటున నెలకు 2.3 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2025 సగటుతో పోలిస్తే ఈ రిజిస్ట్రేషన్లు లక్ష ఎక్కువ. ప్రస్తుత నమోదు ప్రకారం 2026 నాటికి మొత్తం ఈవీల రిజిస్ట్రేషన్లు 25 లక్షల మార్కు దాటవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. -
ఈవీ ఛార్జింగ్‌కు సగం ఇళ్లు సిద్ధంగా లేవు!
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో సురక్షితంగా ఈవీలను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 45 శాతం ఇళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థలను అప్‌గ్రేడ్ (ఆధునీకరణ) చేయాల్సిన అవసరం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ (ఏఈఈఈ), ఈవీ ఛార్జింగ్ ప్లాట్‌ఫామ్ ‘కజామ్’ భాగస్వామ్యంతో రూపొందించిన ‘ది నెట్–జీరో ట్రాన్సిషన్ స్టార్ట్స్ అట్ హోమ్: ఎనేబ్లింగ్ ఈవీ–రెడీ రెసిడెన్సెస్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను న్యూఢిల్లీలో విడుదల చేశారు. టైర్–1, టైర్–2, టైర్–3 నగరాల్లోని స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల సముదాయాలు, అద్దె ఇళ్లతో సహా సుమారు 80,000 పైగా నివాస ప్రాంతాల్లో ఉన్న ఈవీ ఛార్జర్ల డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నివేదికలోని ముఖ్యాంశాలు:∙దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్‌లో ఈవీల వాటా 2024లో కేవలం 0.2%గా ఉండగా, 2035 నాటికి అది దాదాపు 6%కి పెరిగే అవకాశం ఉందని అంచనా. ∙ప్రస్తుతం ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారిలో కేవలం 55 శాతం మందికి మాత్రమే ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.∙సరైన మౌలిక వసతులు, ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల చాలామంది సాధారణ విద్యుత్ సాకెట్లు, తాత్కాలిక ఎక్స్టెన్షన్ వైర్లు, ఇతర షేర్డ్ కనెక్షన్ల ద్వారా ప్రమాదకరమైన పద్ధతుల్లో ఛార్జింగ్ చేస్తున్నారు. నిరంతర ఈవీ ఛార్జింగ్ లోడ్‌ను భరించేలా ఇవి రూపొందించకపోవడంతో షార్ట్ సర్క్యూట్లు, అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. ఇలాంటి పద్ధతుల వల్ల ఛార్జింగ్ విశ్వసనీయత తగ్గడంతో పాటు ఛార్జింగ్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాహన బ్యాటరీ సామర్థ్యం కూడా వేగంగా క్షీణించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కియా కొత్త కార్లు.. మార్కెట్లోకి టాప్ వేరియంట్లునివేదిక సూచనలు: ఇళ్ల వద్ద ఈవీలను సురక్షితంగా, విశ్వసనీయంగా, సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు ప్రతి ఇల్లు కనీస భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలని నివేదిక సూచించింది. నిరంతర ఛార్జింగ్ లోడ్‌ను తట్టుకునేందుకు తగినంత విద్యుత్ లోడ్ (సాంక్షన్డ్ లోడ్)తో పాటు ప్రత్యేక ఛార్జింగ్ సర్క్యూట్ ఉండాలని పేర్కొంది. అలాగే ప్రమాణాలకు అనుగుణమైన వైరింగ్, సరైన ఎర్తింగ్, అగి్నప్రమాద భద్రతా నిబంధనలకు అనుగుణంగా సురక్షిత ప్రదేశంలో ఛార్జర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. అదనంగా తగిన సామర్థ్యం గల ఎంసీబీలు, ఎర్త్–లీకేజ్ ప్రొటెక్షన్ వ్యవస్థ, అలాగే నిరంతర ఛార్జింగ్ లోడ్‌ను తట్టుకునే సరి్టఫైడ్ (ధృవీకరించిన) ప్రత్యేక ఈవీ సబ్–మీటర్‌ను ఉపయోగించాలని నివేదిక సిఫార్సు చేసింది. ఇది చదివారా? పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట! -
ఈవీల కోసం కేంద్రం మరో కొత్త స్కీమ్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన ఖనిజాలను డెడ్ అయిపోయిన బ్యాటరీలు, ఈ-వ్యర్థాలు, జీవితకాలం ముగిసిన వాహనాల నుంచి రీసైకిల్ చేసేందుకు రూ.1,500 కోట్ల విలువైన ‘క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్’ను అమలు చేయనున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన బ్యాటరీ సమ్మెట్ 2026 సదస్సులో ఈ ప్రకటన చేశారు. ఈ పథకం జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)లో భాగంగా అమలవుతుంది.ప్రస్తుతం భారత్‌లో ఈవీలు, పవర్ స్టోరేజ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా విస్తరిస్తుండటంతో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2022లో సుమారు 20 గిగావాట్-గంటల (GWh) స్థాయిలో ఉన్న డిమాండ్ 2030 నాటికి 220 GWhకు చేరే అవకాశం ఉంది. దీంతో దిగుమతి బ్యాటరీ పదార్థాలపై ఆధారపడటం కూడా గణనీయంగా పెరిగింది.ఈ నేపథ్యంలో పాత బ్యాటరీల నుంచి విలువైన ఖనిజాలను రీసైకిల్ చేయడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రీసైక్లింగ్ యూనిట్లకు మూలధన (Capex), కార్యకలాపాల (Opex) సబ్సిడీలు అందించేలా పథకాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఖనిజాలను నిజంగా వెలికితీసే రీసైక్లింగ్ సంస్థలకే ప్రోత్సాహకాలు లభిస్తాయి.ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకం ద్వారా కనీసం 270 కిలోటన్నుల వార్షిక రీసైక్లింగ్ సామర్థ్యం ఏర్పడి, దాదాపు 40 కిలోటన్నుల కీలక ఖనిజాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. అలాగే సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు దాదాపు 70 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.ఇదే సమయంలో కీలక ఖనిజాల రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంచేందుకు నాలుగు క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పార్కులు, తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు అర్జెంటీనా సహా విదేశాల్లో లిథియం నిక్షేపాల కొనుగోలు, దేశీయ అన్వేషణ ప్రాజెక్టులు, ఖనిజ బ్లాకుల వేలం వంటి చర్యల ద్వారా దీర్ఘకాలిక సరఫరా భద్రతపై దృష్టి సారిస్తోంది.ఈ చర్యలు భారత ఈవీ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల భద్రతను పెంచడమే కాకుండా, చైనా వంటి దేశాలపై ఉన్న ఆధారాన్ని క్రమంగా తగ్గించి ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి తోడ్పడతాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌కు స్థిరమైన, తక్కువ వ్యయంతో కూడిన బ్యాటరీ సరఫరా వ్యవస్థను నిర్మించడంలో ఈ పథకం కీలక మైలురాయిగా భావిస్తున్నారు. -
EVలకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
భారత ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) వైపు అడుగులు వేసిన ప్రభుత్వం, భవిష్యత్తులో E22, E25, E27, E30 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. ఈ పరిణామాలు దేశంలోని వాహన కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.ఇటీవల ప్రభుత్వం 22 నుంచి 30 శాతం వరకు ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడం ద్వారా అధిక ఇథనాల్ వినియోగానికి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఇంధనాలు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా, వాటి ప్రమాణాలను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో.. వాహన కొనుగోలుదారుల్లో అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం కొనుగోలు చేసే పెట్రోల్ వాహనాలు వాటికి అనుకూలంగా ఉంటాయా?, లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై నిర్వహించిన సర్వేలో 28 వేలకుపైగా మంది పాల్గొన్నారు. వారిలో 43 శాతం మంది E20, E30 వంటి ఇంధనాల భవిష్యత్ ప్రభావాల కారణంగా వచ్చే ఏడాది కొత్త వాహనాల కొనుగోలును వాయిదా వేయాలని లేదా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు.సర్వేలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 6 శాతం మంది మాత్రమే కొత్త పెట్రోల్ వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు 7 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), 7 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు. అంటే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే EVలు, హైబ్రిడ్ వాహనాలపై ఆసక్తి రెట్టింపుకన్నా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.ఇంధన భవిష్యత్తుపై అనిశ్చితి, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రముఖ ఈవీ మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది.దేశవ్యాప్తంగా EVల వినియోగం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోషియేషన్ (FADA) గణాంకాల ప్రకారం, 2026 మే నెలలో మొత్తం వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 11 శాతాన్ని దాటింది. అదే నెలలో EVల రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 45 శాతం పెరిగి 2.71 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ 81 శాతం పెరగడం ఈ రంగంలో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. -
టాటా కారు కొనుగోలుదారులకు షాక్!
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటర్స్ (Tata Motors) మరోసారి కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలోని పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జూలై 1, 2026 నుంచి గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు భిన్నంగా ఉండనుంది. కొత్త ధరల జాబితాను జూలై 1న వెల్లడించనున్నారు.ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు అధికమవడం, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కంపెనీ తెలిపింది. ఖర్చుల భారాన్ని ఇప్పటివరకు గణనీయంగా సంస్థే భరించినప్పటికీ, దాని ప్రభావంలో కొంత భాగాన్ని ఇప్పుడు వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాటా మోటార్స్ పేర్కొంది.ఈ ధరల పెంపు టాటా ప్యాసింజర్ వాహనాల మొత్తం శ్రేణిపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టాటా టియాగో (Tata Tiago), టాటా టైగర్, టాటా పంచ్ (Tata Punch), టాటా నెక్సాన్, టాటా కర్వ్ (Tata Curvv), టాటా హారియర్, టాటా సఫారీ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఉన్నాయి. ఇటీవల పరిచయమైన టాటా సియెర్రా (Tata Sierra), సియెర్రా ఈవీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.టాటా మోటార్స్ ఈ ఏడాదిలో చేపడుతున్న రెండో ధరల పెంపు ఇది. అంతకుముందు ఏప్రిల్ 1 నుంచే కొన్ని వాహనాల ధరలను సంస్థ పెంచింది. మరోవైపు కమర్షియల్ వాహనాల ధరలను కూడా ఏప్రిల్‌లో 1.5 శాతం వరకు టాటా మోటర్స్ పెంచింది.ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న వ్యయాల ప్రభావంతో ఇతర కంపెనీలు కూడా ధరల సవరణలు చేపడుతున్నాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki) జూన్ 1 నుంచి కొన్ని మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచగా, హ్యుందాయ్ మోటర్స్ ఇండియా (Hyundai) కూడా జూన్ నుంచి ధరలను పెంచింది. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది.జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానుండటంతో, టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు జూన్ నెలాఖరు లోపు బుకింగ్ లేదా కొనుగోలు పూర్తి చేస్తే ప్రస్తుత ధరల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ జూన్ నెలలో కొన్ని మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. -
1200 KM రేంజ్: వచ్చేస్తోంది కొత్త రకం హైబ్రిడ్ కారు..
న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ‘బీవైడీ’ భారత అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా, దేశీయ మార్కెట్లో తన తొలి ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీ ‘సీల్ యూ’ను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. కంపెనీ అభివృద్ధి చేసిన డీఎం–ఐ (డ్యూయల్ మోడ్ ఇంటెలిజెంట్) సాంకేతికత ఆధారంగా రూపొందిన తొలి వాహనం ఇదేనని తెలిపింది. దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలను లాంచ్ సమయంలోనే వెల్లడిస్తామని సంస్థ పేర్కొంది.‘ఎలక్ట్రిక్–ఫస్ట్ విధానంలో పనిచేసే డీఎం–ఐ సాంప్రదాయ హైబ్రిడ్ వాహనాల్లో పెట్రోల్ ఇంజిన్ ప్రధానంగా ఉండి, బ్యాటరీ కేవలం అదనపు సపోర్ట్ ఇస్తుంది. కానీ, బీవైడీ పరిచయం చేస్తున్న డీఎం–ఐ టెక్నాలజీ దీనికి భిన్నంగా ‘ఎలక్ట్రిక్–ఫస్ట్’ విధానంలో పనిచేస్తుంది. అంటే, రోజువారీ ప్రయాణాల్లో కారు గరిష్టంగా బ్యాటరీతోనే నడుస్తుంది. దూర ప్రయాణాల్లో లేదా బ్యాటరీ అయిపోతున్న సమయంలో మాత్రమే మైలేజ్ పెంచడానికి పెట్రోల్ ఇంజిన్ సహాయపడుతుంది. ఈ సరికొత్త ‘సీల్ యూ ఎస్యూవీ’ని విదేశాల నుండి నేరుగా భారత్‌కు దిగుమతి చేయనున్నారు. భారత్‌లోనే బ్యాటరీల తయారీపై కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.పెరుగుతున్న ఈవీ డిమాండ్ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల కారణంగా ఈ మే నెలలో ఇంధన ధరలు నాలుగు సార్లకు పైగా పెరగడంతో భారత్‌లో ఈవీల పట్ల ఆసక్తి పెరిగిందని రాజీవ్ చౌహాన్ తెలిపారు. ‘వాహన్’ డేటా ప్రకారం.. మే నెలలో దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 25,000 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఇప్పటికే 14,000 మందికి పైగా బీవైడీ కస్టమర్లు ఉన్నారు. పూర్తి ఎలక్ట్రిక్ కార్లకు మారే ముందు కస్టమర్లకు ఇదొక ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 1,200 కి.మీ పరిధి ‘‘ఒక్కసారి పూర్తి ఛార్జింగ్, ఫుల్ పెట్రోల్ ట్యాంక్‌తో ఈ కారు ఏకంగా 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. రోజూ సిటీలో 50 కిలోమీటర్లు తిరిగే వారు, ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఛార్జ్ చేసుకుంటే నెలల తరబడి పెట్రోల్ అవసరం లేకుండా కేవలం ఈవీ మోడ్‌లోనే దీనిని నడపవచ్చు’’ అని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహిక ల్స్ బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మెరుగైందన్నారు. కేవలం హైవేలపై మాత్రమే ప్రణాళిక అవసరమన్నారు. -
టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు
దేశీయ వాహన దిగ్గజం టాటా మోటర్స్ (Tata Motors) ఈ జూన్ నెలలో తమ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను మరింత పెంచుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై గ్రీన్ బోనస్‌లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, లాయల్టీ బోనస్‌ల రూపంలో మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ముఖ్యంగా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మోడళ్లపై అత్యధిక తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి.కర్వ్ ఈవీపై అత్యధిక బెనిఫిట్లుTata Curvv EV Discount: టాటా కర్వ్ ఈవీ ఎంపిక చేసిన నాన్-ఎక్స్ వేరియంట్లపై మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.3 లక్షల గ్రీన్ బోనస్‌తో పాటు రూ.30,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్లపై రూ.2.85 లక్షల వరకు ప్రయోజనాలు ఉండగా, ఎక్స్ సిరీస్ వేరియంట్లకు ఎక్స్చేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ బోనస్‌ల రూపంలో రూ.65,000 వరకు లభించనున్నాయి.హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకు..Tata Harrier EV Offers: టాటా హారియర్ ఈవీ అన్ని వేరియంట్లపై రూ.2.75 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో రూ.50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.75,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.1 లక్ష లాయల్టీ బోనస్‌తో పాటు అదనంగా మరో రూ.1 లక్ష ప్రయోజనం ఉంది. దీంతో హారియర్ ఈవీ కొనుగోలుదారులకు గణనీయమైన ఆదా అవకాశం కలుగుతోంది.పంచ్ ఈవీ, టియాగో ఈవీపైనా భారీ తగ్గింపులుTata Punch EV Discount: అవుట్గోయింగ్ పంచ్ ఈవీ వేరియంట్లపై రూ.95 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ రేంజ్ (LR) వేరియంట్లకు గరిష్ఠంగా రూ.1.45 లక్షలు, మీడియం రేంజ్ (MR) వేరియంట్లకు రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.Tata Nexon EV Offers: అలాగే అవుట్గోయింగ్ టియాగో ఈవీపై రూ.65 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు ప్రకటించారు. LR XT వేరియంట్‌కు అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు ఆఫర్ ఉండగా, ఇతర LR వేరియంట్లకు రూ.1.25 లక్షలు, MR వేరియంట్లకు రూ.65 వేల వరకు ప్రయోజనాలు అందుతున్నాయి.నెక్సాన్ ఈవీపై రూ.50 వేల వరకు..టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) సిరీస్‌పై మొత్తం రూ.50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.15 వేల గ్రీన్ బోనస్, రూ.25 వేల ఎక్స్చేంజ్ బెనిఫిట్, రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ ఆఫర్లను ఒకేసారి పొందే అవకాశం లేదు.ఎందుకు ఇంత భారీ ఆఫర్లు?భారత ఈవీ మార్కెట్లో పోటీ పెరుగుతుండటం, కొత్త మోడళ్ల రాక, కొన్ని పాత స్టాక్లను క్లియర్ చేయాల్సిన అవసరం నేపథ్యంలో టాటా మోటార్స్ ఈ భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అవుట్గోయింగ్ పంచ్ ఈవీ, టియాగో ఈవీ వేరియంట్లపై అధిక తగ్గింపులు ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు.ఈ ఆఫర్లు నగరం, డీలర్ స్టాక్ లభ్యత, వాహనం తయారీ సంవత్సరం (Model Year), వినియోగదారుడి అర్హత వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. కాబట్టి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు సమీప టాటా డీలర్‌షిప్‌ను సంప్రదించి తాజా వివరాలు తెలుసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.ఇదీ చదవండి: హ్యుందాయ్ కార్లపై ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు -
ఎలక్ట్రిక్ కార్ల విప్లవం.. ఇంధన ధరలకు చెక్
-
హైదరాబాద్‌లో టెస్లా.. రెడీ అవుతున్న షోరూం!
సాక్షి, హైదరాబాద్: టెస్లా.. ఎలక్ట్రిక్ కారు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు. ఇప్పటికే భారత్‌లో ముంబై, న్యూఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను తెరిచిన టెస్లా.. హైదరాబాద్‌లోనూ అడుగు పెడుతోంది. కొండాపూర్‌లో రెండు నెలల్లో సేల్స్, సర్వీస్ సెంటర్ సిద్ధం అవుతోందని సమాచారం.యూఎస్‌కు చెందిన ఈ సంస్థ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడల్–వై కారును ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఆటోపైలెట్, ఫుల్ సెల్ఫ్–డ్రైవింగ్ వంటి అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు కంపెనీ కార్ల ప్రత్యేకత. టెస్లా అంటే కేవలం కార్లు మాత్రమే కాదని, ఈ సంస్థ రాకతో హైదరాబాద్ రియల్టీకి పెద్ద బూస్ట్‌నిస్తుందని రియల్టీ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు ‘సాక్షి’కి తెలిపారు.టెస్లా కార్లకు ఇక్కడి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విషయంలో బెంగళూరును బీట్ చేశామని, హైనకెన్, లాంజా వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరడానికి ఇక్కడి మౌలిక వసతులు కారణమన్నారు. టాప్–20 ఎన్బీఎఫ్సీలు అన్నీ హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఒక్క భాగ్యనగరికే ఈ ఘనత సాధ్యమైందన్నారు.మంత్రి శ్రీధర్‌బాబుతో టెస్లా డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ (ఎడమ నుంచి కుడికి) విస్తరణ చేపట్టండి.. మంత్రి శ్రీధర్‌బాబును టెస్లా బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌లో షోరూం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దేశంలో ప్రస్తు తం కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్‌ను క్లీన్ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని పేర్కొన్నారు.తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామశర్మ పాల్గొన్నారు. -
స్టాక్ మార్కెట్లోకి హైదరాబాద్ ఈవీ కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాజా ఇంటర్నేషనల్‌తో రివర్స్ మెర్జర్ అనంతరం హైదరాబాద్‌కి చెందిన కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కెటో మోటర్స్ .. బీఎస్ఈలో లిస్టయింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఇదొక కీలక మైలురాయని సంస్థ డైరెక్టర్ వెంకటేష్ చల్లా తెలిపారు.దేశీయంగా వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల రంగం పరివర్తనలో తమ సంస్థ అర్ధవంతమైన పాత్రను పోషించగలదని పేర్కొన్నారు. కంపెనీ తెలంగాణలో తలపెట్టిన రూ. 300 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్రాజెక్టు, అర్బనోవా కేఈ9 పేరిట తొమ్మిది మీటర్ల ఎలక్ట్రిక్ బస్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో సంస్థ లిస్టింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.


