స్టాక్‌ మార్కెట్‌లోకి హైదరాబాద్ ఈవీ కంపెనీ | hyderabad keto motors bse listed | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌లోకి హైదరాబాద్ ఈవీ కంపెనీ

May 21 2026 4:48 PM | Updated on May 21 2026 4:56 PM

hyderabad keto motors bse listed

బీఎస్‌ఈలో కెటో మోటర్స్‌ లిస్టింగ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తాజా ఇంటర్నేషనల్‌తో రివర్స్‌ మెర్జర్‌ అనంతరం హైదరాబాద్‌కి చెందిన కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ కెటో మోటర్స్‌ .. బీఎస్‌ఈలో లిస్టయింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఇదొక కీలక మైలురాయని సంస్థ డైరెక్టర్‌ వెంకటేష్‌ చల్లా తెలిపారు.

దేశీయంగా వాణిజ్య ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం పరివర్తనలో తమ సంస్థ అర్ధవంతమైన పాత్రను పోషించగలదని పేర్కొన్నారు. కంపెనీ తెలంగాణలో తలపెట్టిన రూ. 300 కోట్లతో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ ప్రాజెక్టు, అర్బనోవా కేఈ9 పేరిట తొమ్మిది మీటర్ల ఎలక్ట్రిక్‌ బస్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో సంస్థ లిస్టింగ్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement