రూ. 10,000 కోట్లు దాటేసిన డీఎస్‌ గ్రూప్‌ | DS Group Crosses Rs 10000 Crore Revenue Mark Eyes Rs 20000 Cr By 2030 | Sakshi
Sakshi News home page

రూ. 10,000 కోట్లు దాటేసిన డీఎస్‌ గ్రూప్‌

Apr 27 2025 8:00 AM | Updated on Apr 27 2025 8:02 AM

DS Group Crosses Rs 10000 Crore Revenue Mark Eyes Rs 20000 Cr By 2030

న్యూఢిల్లీ: దేశీ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ధరమ్‌పాల్‌ సత్యపాల్‌(డీఎస్‌) గ్రూప్‌ నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు వీలుగా మొత్తం రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలియజేశారు. తద్వారా శత వసంతాలు పూర్తి చేసుకోనున్న 2029కల్లా రూ. 20,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

దీనిలో భాగంగా ఆతిథ్యం, ఆహారం, పానీయాల విభాగాలలో ఇతర సంస్థలను కొనుగోలుచేసే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా కార్యకలాపాలను వేగంగా విస్తరించే  వ్యూహాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. గతంలో నమిలే పొగాకు ఉత్పత్తులతో ప్రసిద్ధమైన కంపెనీ వీటిని టర్నోవర్‌లో 10 శాతానికంటే తక్కువకు పరిమితం చేసినట్లు తెలియజేశారు.

మార్చితో ముగిసిన గతేడాది(2024–25) సాధించిన రూ. 10,000 కోట్ల ఆదాయంలో వీటి వాటా 10 శాతంకంటే తక్కువేనని, అయితే ఈ విభాగం నుంచి పూర్తిగా వైదొలగబోమని స్పష్టం చేశారు. ఆహారం, పానీయాల నుంచి 42 శాతం సమకూరినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement