అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు | Cm Revanth Reddy Key Directives On Revenue Mobilization | Sakshi
Sakshi News home page

అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

Jul 1 2026 4:44 PM | Updated on Jul 1 2026 5:03 PM

Cm Revanth Reddy Key Directives On Revenue Mobilization

సాక్షి, హైదరాబాద్: ఆదాయ సమీకరణపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. హెచ్‌ఎండీఏ,టీజీఐఐసీ, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్‌తో పాటు వివిధ శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత వహించాలన్నారు. ఆదాయ సమీకరణకు సంబంధించి. చేజింగ్ సెల్ ఏర్పాటు చేసుకుని నిరంతరం ఫాలో అప్ చేయాలని రేవంత్‌​ సూచించారు.

‘‘అనుకుంటున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా శాఖలవారీగా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానం చేసుకోవాలి. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలి. భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఊహాజనిత బడ్జెట్ కాదు.. వాస్తవికత ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందే.’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement