హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు గవర్నర్ తేనీటి విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు, ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు.


