ఆధార్ హోల్డర్లకు ఊరట.. ఆరు నెలల పాటు ఈ సేవ ఫ్రీ! | Aadhaar Email Update To Be Free Via Mobile App From July 1st 2026, Here’s How To Use It | Sakshi
Sakshi News home page

ఆధార్ హోల్డర్లకు ఊరట.. ఆరు నెలల పాటు ఈ సేవ ఫ్రీ!

Jun 22 2026 3:49 PM | Updated on Jun 22 2026 4:20 PM

Aadhaar Email Update to Be Free Via Mobile App From July 1St

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వినియోగదారులను ఊరటను ఇచ్చే ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆధార్‌లో ఈమెయిల్ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవడానికి వసూలు చేస్తున్న రూ.75 ఫీజును, ఆరు నెలల పాటు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.

యూఐడీఏఐ ప్రకారం.. ఈ సదుపాయం 2026 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ చిరునామాను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం లభించింది.

ఆధార్‌కు ఈమెయిల్ ఐడీ లింక్ చేసి ఉంటే, ఆధార్‌కు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్డేట్స్, సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పొందవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం, ఇటీవల ప్రారంభించిన ఆధార్ మొబైల్ యాప్‌లో మొబైల్ నెంబర్ అప్‌డేట్, అడ్రస్ అప్‌డేట్, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, ఈ ఆధార్ డౌన్‌లోడ్, అథెంటికేషన్ హిస్టరీ చెక్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఉచిత ఈమెయిల్ అప్‌డేట్ సదుపాయం కేవలం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో ఈమెయిల్‌ను ధృవీకరించుకోవడానికి ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేసి.. వెరిఫై ఈమెయిల్ అడ్రెస్స్ ఎంపికను ఎంచుకోవాలి.

అయితే.. ఆరు నెలల తర్వాత ఈ ఫీజు మినహాయింపును కొనసాగించాలా? లేదా మళ్లీ ఫీజు అమలు చేయాలా అనే విషయంపై యూఐడీఏఐ నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రస్తుతానికి ఈమెయిల్ ఐడీ అప్డేట్ చేయనివారు నిర్ణీత సమయం లోపల ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement