హింటిస్తే అర్థం చేసుకోరే..! మణిని చెడుగుడు ఆడుకున్న గంగవ్వ | Bigg Boss Telugu 8, Oct 07th Full Episode Review: Sixth Week Nominations | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: యష్మి ఇదే తగ్గించుకుంటే మంచిది.. మణికి లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చిపడేసిన తేజ

Oct 7 2024 11:23 PM | Updated on Oct 8 2024 10:05 AM

Bigg Boss Telugu 8, Oct 07th Full Episode Review: Sixth Week Nominations

వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలతో హౌస్‌ కళకళలాడిపోయింది. సీజన్‌ ప్రారంభం అయినప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్‌ కార్డ్స్‌ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. మరి వీళ్ల నామినేషన్స్‌ ఎలా ఉన్నాయో నేటి (అక్టోబర్‌ 7) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

గంగవ్వా.. మజాకా!
వైల్డ్‌ కార్డ్స్‌ను చూసి హౌస్‌మేట్స్‌కు భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటివాళ్లు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది. నీ పెండ్లాం, పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్‌.. అంత యాదికొస్తే ఎందుకొచ్చినవ్‌ ఇక్కడికి అని కౌంటర్‌ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్‌ వేసింది. ఇకపోతే ప్రైజ్‌మనీ రూ.38 లక్షలకు చేరుకుంది.

తేజకు శిక్ష
ఓజీ టీమ్‌ పాలు సహా కొన్ని రేషన్‌ సామానును రాయల్‌ టీమ్‌కు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చీరావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్‌ తెగ ఫ్రస్టేట్‌ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూపాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్‌బాస్‌ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు.

మణికంఠను టార్గెట్‌ చేశావ్‌..
తర్వాత నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. రాయల్‌ టీమ్‌కు మాత్రమే నామినేట్‌ చేసే ఛాన్స్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మొదటగా హరితేజ.. గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్‌ చేశావంటూ యష్మిని నామినేట్‌ చేసింది. ఇన్‌ఫ్లుయెన్స్‌ అవుతున్నావ్‌, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్‌ చేసింది. గౌతమ్‌.. నీ గేమ్‌ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్‌ చేశాడు.  మణిని టార్గెట్‌ చేయడం వల్లే అతడికి సింపతీ వస్తోందని రాయల్‌ టీమ్‌ హింటిస్తోంది. కానీ దాన్ని యష్మీ అర్థం చేసుకోలేకపోయింది.

మెహబూబ్‌ సిల్లీ నామినేషన్స్‌
నయని వంతురాగా..  నీకసలు సీరియస్‌నెస్‌, ఇంట్రస్ట్‌ లేదంటూ విష్ణు మెడలో నామినేటెడ్‌ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ.. నామినేట్‌ చేయడం దేనికి? బయటకు వెళ్లిపోతుంటే ఏడ్వడం దేనికని ఆమె ఎమోషన్‌ను ప్రశ్నించింది. మెహబూబ్‌ వంతురాగా.. నువ్వు నాతో సరిగా మాట్లాడలేదంటూ సీతను నామినేట్‌ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నారంటూ యష్మి మెడలో బోర్డు వేశాడు. తేజ మాట్లాడుతూ.. చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ సీతను నామినేట్‌ చేశాడు. 

ఒక్కో పాయింట్‌ కూడా తూటా
మణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్‌ పాయింట్లు చెప్పాడు. 1. ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావ్‌.. అది నీ గేమా? 2. సీత నీకు ఫ్రెండ్‌ అన్నావ్‌, కానీ బిగ్‌బాస్‌ అడిగినప్పుడు నబీల్‌, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్‌, అంటే సీత నీ ఫ్రెండ్‌ కాదా? 3. తన ఫుడ్‌ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ మరీ చెప్పాడు, అయినా సరే యష్మిది పక్కనపెట్టి మరీ అతడికే ఫుడ్‌ తీసుకెళ్లావ్‌.. దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్‌ చేశాడు. 

యష్మి సైకోయిజం!
ఈ నామినేషన్‌ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు. చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు. పదేపదే ఏడ్వడం మానుకుంటున్నానని, సీత ఇప్పుడు బెస్ట్‌ ఫ్రెండ్‌ కాదని, మదర్‌ సెంటిమెంట్‌ వల్లే పృథ్వీకి ఫుడ్‌ ఇచ్చానని మూడింటికీ ఆన్సరిచ్చాడు. మిగతావారి నామినేషన్స్‌ రేపటి ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement