బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Jul 20 2026 1:26 AM | Updated on Jul 20 2026 1:26 AM

తీరంలో భూఆక్రమణల చెర వేటపాలెం: సముద్రతీర ప్రాంతంలోని భూముల్లో సుమారు 40 శాతం ప్రభుత్వ పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూములున్నాయి. గడిచిన మూడేళ్లలో తీరప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతంలో రిసార్టులు, పర్యాటక కేంద్రాలు పెరిగాయి. ఫలితంగా ఎకరా భూమి రూ. 6 కోట్లు నుంచి రూ. 7 కోట్లు వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి వాటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్‌ ఇందుకోసం సంబంధిత భూములకు రెవెన్యూ శాఖ నుంచి అవసరమైన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్వోసీ) పొందేందుకు పెద్ద ఎత్తున అక్రమ మార్గాలు ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్వోసీ ఆధారంగా అదే ప్రాంతంలో ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ జరిగే నంబర్లను కేటాయించి, అనంతరం రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుతో పరిశీలన ప్రభుత్వం పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూములు అక్రమంగా చేతులు మారితే అసలు లబ్ధిదారుల హక్కులు దెబ్బతింటాయని వారంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తపేట రెవెన్యూ సర్వే నెంబరు 427–3సీ10లో 1985 సంవత్సరంలో కారంచేడు బాధితులకు కేటాయించిన ప్రభుత్వ భూములను పెద్దలు ఆక్రమంచి రియల్‌ వ్యాపారం చేస్తున్నారని ఎస్సీలు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ కమిషన్‌ సభ్యుల బృందం వచ్చి ఆ భూములను పరిశీలించి వెళ్లింది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వ్యవస్థపైనే ఒత్తిళ్లు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, అసైన్డ్‌ భూములపై జరిగిన లావాదేవీలు, జారీ చేసిన ఎన్వోసీలు, రిజిస్ట్రేషన్ల చట్ట బద్ధతను పరిశీలించాలని స్థానికులు, మత్స్యకారులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు ఆక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెవెన్యూ శాఖపై ఒత్తిళ్లు..

న్యూస్‌రీల్‌

సాగర్‌ నీటిమట్టం

తీరం వెంట అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు ఆ భూములకు ఎన్వోసీలు ఇవ్వాలని కోరుతూ రెవెన్యూ శాఖపై ఒత్తిళ్లు తెస్తున్నారు. లొంగితే భారీగా నజరానా, లేని పక్షంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూములకు ఎన్వోసీలు ఇవ్వడానికి నిరాకరించిన మండల సర్వేయర్‌లపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆయనను బెదిరించడంతో పాటు, వ్యక్తిగతంగా హైకోర్టులో కేసులు కూడా దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విధులు నిర్వహించడం కష్టసాధ్యంగా మారండంతో సంబంధిత మండల సర్వేయర్‌ ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది.

సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026
తీరంలో భూఆక్రమణల చెర

తీరప్రాంత అసైన్డ్‌ భూముల్లో

రియల్‌ ఎస్టేట్‌ దందా

ఎన్వోసీల కోసం రెవెన్యూ

అధికారులపై ఒత్తిళ్లు

సర్వేయర్‌లకు బెదిరింపులు,

కోర్టు కేసులు

ప్రశ్నార్థకంగా మారిన

ప్రభుత్వ భూముల పరిరక్షణ

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.40 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

చీరాల నియోజకవర్గం పరిధిలో దాదాపు 40 శాతం వరకు అసైన్డ్‌, ప్రభుత్వ భూములున్నాయి. సముద్ర తీరం పరిధిలోని ఓడరేవు నుంచి రామచంద్రాపురం వరకు వందల ఎకరాల అసైన్డ్‌ భూములుగా రికార్డులున్నాయి. తీరాన్ని ఆనుకుని ఉన్న ఈ భూములు ప్రస్తుతం భారీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారాయి. చీరాల ప్రాంతంలో ఓడరేవు నుంచి వేటపాలెం మండలం రామాపురం, కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామల పరిసరాల్లో పర్యాటక కార్యకలాపాలు పెరగడం, రిసార్టులు ఏర్పడటంతో భూముల విలువ ఒక్కసారిగా భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వానికి చెందిన అసైన్డ్‌ భూములపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలకు తెరలేపినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement