ఓడరేవు నుంచి వేటపాలెం మండలంలోని పొట్టిసుబ్బయ్యపాలెం వరకు పర్యాటక పాంత్రంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో రియల్టర్లు, రిసార్టు యాజమానుల కన్ను అటవీ భూములపై పడింది. తీరప్రాంత భూములను అక్రమించి రిసార్టులు నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రిసార్టులకు ఎదురుగా సముద్రం కనిపించేలా ఉండాలనే దురుద్దేశంతో తీరం వెంట సరుగుడు తోటలు పెంచకుండా అధికారులకు, మత్స్యకారులకు కొంత ముట్టజెప్పి ఆ భూములను ఖాళీగా వదిలేస్తున్నారు. వారి రిసార్టుల నుంచి పర్యాటకులు నేరుగా సముద్రంలోకి వెళ్లడానికి తోటలను పెంచకుండా కుయుక్తులు పన్నుతున్నారు.


