న్యూస్‌రీల్
మాతృ,శిశు మరణాలు నివారించాలి
బాపట్ల
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
స్వచ్ఛ గ్రామాలే
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.480 టీఎంసీలు. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
నిజాంపట్నం (రేపల్లె): స్వచ్ఛ గ్రామాలే స్వర్ణాంధ్రకు పునాది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ చెప్పారు. స్వచ్ఛ ఆంద్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అడవులదీవి గ్రామ జడ్పీహైస్కూల్ ఆవరణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణమే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు తొలి అడుగని పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన సభలో కలెక్టర్ పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం లక్ష్యాలు, ప్రభుత్వ ఆశయాలు, ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. గ్రామాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పారిశుధ్య నిబంధనలు పాటించడం, మొక్కలు నాటడం వంటి చర్యలను ప్రతి కుటుంబం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే స్వచ్ఛ గ్రామాల లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని చెప్పారు. తొలుత గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో బూసి శ్రీదేవి, డీపీఓ ఎల్.ప్రభాకరరావు, సీపీఓ ఏఎస్ రాజు, డ్వామా పీడీ విజయలక్ష్మి, డిఆర్డీఏ పీడీబీ సింగయ్య, ఐసీడీఎస్ పీడీ రాధమాదవి, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో నర్రా నాగలక్ష్మి, నాయకులు అనగాని శివప్రసాద్, హెచ్‌ఎం ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి
బాపట్ల : పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అధికారులంతా సహకరించాలని కలెక్టర్ చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకరించాలన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఆన్ లైన్ లో నమోదైన 27 దరఖాస్తులను ఏకపక్ష పద్ధతిలో ఆమోదించేందుకు వేగంగా దరఖాస్తులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై. రామకృష్ణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, బాపట్ల ఆర్డీవో హరికుమార్, కమిటీలోని ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మాతృ, శిశు మరణాలు పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. పీఎం సురక్షిత్ మంత్రిత్వ అభియాన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. మాతృ, శిశు మరణాల నిర్మూలన లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ అన్నారు. కాన్పుల సమయాలలో మరణాలు అరికట్టగలిగితే నవజాత శిశువు అభివృద్ధికి తోడ్పాటునందించగలమన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


