ఆరు నెలల సహజీవనం.. ఒక్క క్షణంలో విషాదాంతం | Instagram Friendship Turns Fatal, Bengaluru Woman Allegedly Strangled To Death By Live-In Partner, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆరు నెలల సహజీవనం.. ఒక్క క్షణంలో విషాదాంతం

Jun 18 2026 7:52 AM | Updated on Jun 18 2026 8:43 AM

Woman strangled to death by live in partner in Malleswaram

కర్ణాటక: యువతీ యువకుడు సహజీవనం చేస్తుండగా, యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌డీ అనుషా (20)ను ఆమె ప్రియుడు శరత్‌ (25) హత్య చేశాడు. ఇద్దరూ కూడా హాజన్‌ జిల్లాలోని సకలేశపురకు చెందినవారు. శరత్‌ వాటర్‌ ట్యాంక్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు, ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేదని సమాచారం. ఇన్‌స్టాలో పరిచయం పెరిగి 6 నెలల నుంచి ఒకే గదిలో సహజీవనం ప్రారంభించారు. 

అయితే 13వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను తీవ్రంగా కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తరువాత మరుసటి రోజున తనకు తెలిసిన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండడం బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అనుషా నేలపై విగతజీవిగా పడి ఉంది. ఇంటి నిర్వహణ, పనుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని యజమాని మహాదేవ తెలిపాడు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement