కుమార్తెను పంపకపోతే.. మనవరాలి నగ్న ఫొటోలు వైరల్‌ చేస్తా! | Tirupati Man Arrested After Threatening To Leak Private Photos Of Minor Girl On Social Media | Sakshi
Sakshi News home page

కుమార్తెను పంపకపోతే.. మనవరాలి నగ్న ఫొటోలు వైరల్‌ చేస్తా!

Oct 8 2026 8:18 AM | Updated on Oct 8 2026 9:22 AM

Tirupati Wife And Husband incident

సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ సంఘటన వెలుగుచూసింది. తన భార్యను కాపురానికి పంపకపోతే మనవరాలి నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని అత్తను బెదిరించిన అల్లుడిని తిరుపతి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని కొత్తపల్లికి చెందిన బిరుదాల ఈశ్వర్‌రెడ్డి (35) కొంతకాలంగా తుమ్మలగుంటలో నివసిస్తున్నాడు. గతంలో ఓ మహిళను వివాహం చేసుకుని ఆమెతో విడిపోయాడు. చదువుకునే రోజుల్లో పరిచయమున్న రామానుజపల్లికి చెందిన కిన్నెరను రెండో వివాహం చేసుకున్నాడు. కిన్నెర కూడా తన మొదటి భర్తతో విడిపోయి కుమార్తెను తీసుకుని ఈశ్వర్‌రెడ్డితో కలిసి జీవించింది.

బాలికపై అత్యాచారయత్నం.. తొలి కేసు
గతేడాది జనవరిలో కిన్నెర కుమార్తెపై ఈశ్వర్‌రెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో తిరుపతి గ్రామీణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన ఈశ్వర్‌రెడ్డి.. భార్య కిన్నెరను తిరిగి తన వద్దకు రావాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో.. తన భార్యను కాపురానికి రాకుండా ఆమె తల్లి కమలమ్మ అడ్డుకుంటోందని భావించాడు. ఈ క్రమంలో కమలమ్మపై సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనపై తిరుపతి పడమర పోలీసులు కేసు నమోదు చేశారు.

అత్తపై వరుసగా ఒత్తిడి
దాడిలో గాయపడిన కమలమ్మ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చిన నెల రోజుల తర్వాత ఈశ్వర్‌రెడ్డి అక్కడికి వెళ్లాడు. కూతురిని తన వద్దకు పంపాలని ఆమెను బెదిరించాడు. దీనిపై కమలమ్మ ఫిర్యాదు చేయడంతో అతడిపై మరో కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కమలమ్మ తన కుమార్తె కిన్నెరను దుబాయ్‌కి పంపించింది. మనవరాలిని మాత్రం తన వద్దే ఉంచుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఈశ్వర్‌రెడ్డి.. కిన్నెరను దుబాయ్‌ నుంచి తిరిగి పిలిపించకపోతే బాలిక నగ్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానంటూ కమలమ్మను బెదిరించాడు.

మార్ఫింగ్‌ చేసి బంధువులకు పంపి..
అంతటితో ఆగకుండా బాలిక ఫొటోను మార్ఫింగ్‌ చేసి నగ్న ఫొటోగా మార్చి బంధువులకు పంపించాడు. దీంతో భయాందోళనకు గురైన కమలమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మరోసారి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఈశ్వర్‌రెడ్డిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement