పచ్చ గూండాల అరాచకం.. అర్ధరాత్రి కర్రలతో దాడి | TDP Leaders Attack On YSRCP Supporter At Ntr District | Sakshi
Sakshi News home page

పచ్చ గూండాల అరాచకం.. అర్ధరాత్రి కర్రలతో దాడి

Aug 4 2024 7:21 AM | Updated on Aug 4 2024 8:38 AM

TDP Leaders Attack On YSRCP Supporter At Ntr District

 

సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్డీఆర్‌ జిల్లాలో టీడీపీ గుండాలు రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ నాయకుడితో సహా మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని జగయ్యపేట ఆసుపత్రికి తరలించారు.

కాగా, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని నవాబుపేటలో టీడీపీ గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వైఎస్సార్‌సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు (@ బుల్లబ్బాయ్) సహా మరో ఐదుగురు దాడికి పాల్పడ్డారు. టిఫిన్ చేసేందుకు హోటల్ వద్దకు వెళ్లిన గింజుపల్లి శ్రీనివాసరావుపై ఒక్కసారిగా దాడి చేశారు. వారి వెంట తెచ్చుకున్న కర్రలతో శ్రీనివాసరావును తీవ్రంగా గాయపరిచారు.

ఈ ఘటన సందర్భంగా హోటల్‌ వద్ద ఉన్న పలువురు టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ఆగకుండా కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు. అంతటితో ఆగకుండా శ్రీనివాసరావు కారును కూడా ధ్వంసం చేశారు. అనంతరం, స్థానికులు గాయపడిన వారిని జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావును మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించిన తెలుస్తోంది. అయితే, 2009లో శ్రీనివాసరావు తండ్రి వీరయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు ఉన్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement