రేపు పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

రేపు పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

రేపు పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు సుగాలీ మహిళలపై కేసు ఇబ్రహీంపట్నం: మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజేష్‌ తమతో పనులు చేయించు కుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరో పిస్తూ జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన కొందరు సుగాలీ మహిళలు శుక్రవారం జాతీయ రహదారిపై ర్యాలీ చేయడంపై ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. కట్టుబడిపాలెంనకు చెందిన బాణావత్‌ రాజు నాయక్‌, తండ్రి రాముతో పాటు మరికొందరు సుగాలి కులాచార దుస్తులు ధరించి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడి వద్ద సారె సమర్పించేందుకు పాదయాత్రగా బయలుదేరి రోడ్డుపై బైఠాయించారు. విజయవాడ వైపు రోడ్డును దిగ్బంధించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. రోడ్డును దిగ్బంధించిన నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): నగరం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరేందుకు సోమవారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్‌ ఎం.విజయసారథి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలి రెండు విడతల కౌన్సెలింగ్‌లలో మిగిలిన సీట్లను ఈ స్పాట్‌ అడ్మిషన్లలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్‌–2026 పరీక్ష రాసిన, రాయని వారు పాల్గొనవచ్చని సూచించారు.

మచిలీపట్నం అర్బన్‌: క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు శనివారం మచిలీపట్నం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఝాన్సీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 224 మంది బాలబాలికలు ఉత్సాహంగా ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. అండర్‌–17, అండర్‌–23 బాలురు, బాలికల విభాగాల్లో 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, ఐదు కిలోమీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, జావెలిన్‌త్రో, షాట్‌పుట్‌ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది క్రీడాకారులను అండర్‌–17, 12 మంది క్రీడాకారులను అండర్‌–23 విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఝాన్సీలక్ష్మి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement