అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం ముగిసిన పవిత్రోత్సవాలు ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళా సాధికారత దసరా ఉత్సవాలలో లడ్డూ ఏటీఎం మిషన్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కర్ణాటకకు చెందిన భక్తులు రూ.2.50 లక్షలు విరాళంగా అందజేశారు. కర్ణాటక రాయచూర్‌ ఎస్సార్‌ నగర్‌కు చెందిన కె.వెంకటరావు, పార్వతి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.2.50 లక్షలు విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈవో కిషోర్‌కుమార్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆషాఢ కృత్తిక(ఆడి కృత్తిక) పవిత్రోత్సవాలు శనివారంతో ముగిసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఈనెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైదిక కార్యక్రమాల ననుసరించి శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు వివరించారు.

మాజీ గవర్నర్‌, రిటైర్డ్‌

అధికారి కిరణ్‌బేడీ

లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండటం అత్యంత కీలకమని, తద్వారానే మహిళా సాధికారత సాధ్యమని పుదుచ్చేరి మాజీ లెె ఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌బేడీ అన్నారు. మహాత్మాగాంధీరోడ్డులోని హోటల్‌ వివంతలో శనివారం ఫిక్కి ఫ్లో ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న కిరణ్‌బేడీ మాట్లాడుతూ సమాజంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక వ్యవహారాలపై పట్టుండాలని, వ్యాపార, ఆర్థిక నిర్వహణను ఇతరులకు అప్పగించకుండా మహిళలే స్వయంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఫిక్కీఫ్లో విజయవాడ చాప్టర్‌ చైర్‌పర్సన్‌ సుప్రియ, పలువురు ప్రతినిధులు, మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్‌ 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలలో ఆలయ అధికారులు కొత్త ప్రతిపాదన చేశారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాల కోసం కౌంటర్ల వద్ద భక్తులు వేచి ఉండకుండా లడ్డూ ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు గాను వారం రోజుల్లో ఆలయ ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా పరిశీలన చేయాలని భావిస్తున్నారు. ఇటీవల దసరా ఉత్సవాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. భక్తులు తమ మొబైల్‌ ఫోన్ల ద్వారా ముందుగా ఆన్‌లైన్‌లో లడ్డూలను బుక్‌ చేసుకుంటే వారి ఫోన్‌కు ఒక ప్రత్యేక కోడ్‌ వస్తుంది. ఆలయ ప్రాంగణంలో 4 నుంచి 5 లడ్డూ ఏటీఎం మిషన్లు ఏర్పాటు చేసి వారికి అక్కడే లడ్డూలను ఇవ్వాలని భావిస్తున్నారు. మరో వైపున ఒక లడ్డూ నుంచి ఆరు లడ్డూల బాక్స్‌ వరకు ఈ ఏటీఎం మిషన్‌ ద్వారా భక్తులు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నూతన విధానం ద్వారా ప్రసాదాల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందని టెక్నికల్‌ టీం చెబుతుండగా, ఇది ఏ స్థాయిలో అమలుకు సాధ్యమనే విషయాన్ని ఆలయ అధికారులు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement