ఒడిశా రాష్ట్ర గవర్నర్
ఘనంగా ‘శ్రీవాణి’ 500వ సంచిక ఆవిష్కరణ వేడుక
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘శ్రీవాణి’ సాంస్కృతిక మాసపత్రిక నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతర సేవలు అందిస్తుందంటే దాని వ్యవస్థాపకుడు కొమరగిరి కృష్ణమోహన్‌రావు దూరదృష్టి, నిబద్ధతే కారణమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు కొనియాడారు. మచిలీపట్నం కేంద్రంగా వెలువడుతున్న ‘శ్రీవాణి’ మాసపత్రిక తన 500వ సంచికతో పాటు ‘మేరునగరి హిమగిరి కొమరగిరి’ పుస్తక ఆవిష్కరణ వేడుకలు శనివారం విజయ వాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగాయి. సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను రక్షిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక స్పృహను పెంపొందిస్తున్న ‘శ్రీవాణి’ యాజమాన్యం, సంపాదకవర్గం, రచయితలు అభినందనీయలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ కొమరగిరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్(చిన్ని), ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, సీనియర్ పాత్రికేయుడు మాశర్మ, ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడారు. ఆవిష్కరణ వేడుకలను ‘శ్రీవాణి’ సంపాదకుడు కొమరగిరి శ్యామ్ ప్రసాద్, మేనేజర్ కొమరగిరి చంద్రశేఖర్, గౌరవ సలహాదారు కొమరగిరి ఉదయ్ కుమార్ నిర్వహించారు.
కంభంపాటి హరిబాబు


