సాక్షి,అమరావతి: ఏపీలో తొమ్మది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షంతో పాటు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , అల్లూరి సీతారామరాజు ,తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి , ఏలూరు , ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళొద్దు. చెట్లకింద నిలబడొద్దని తెలిపింది.


