వ్యభిచార ముఠా గుట్టురట్టు.. 16 మంది అరెస్ట్ | Prostitution Racket Busted in Dwaraka Tirumala | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టురట్టు.. 16 మంది అరెస్ట్

Oct 7 2026 1:56 PM | Updated on Oct 7 2026 2:17 PM

Prostitution Racket Busted in Dwaraka Tirumala

ఏలూరు (ద్వారకాతిరుమల): మండలంలోని లక్ష్మీనగర్‌లో హైవే పక్కనే నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రాత్రి రట్టు చేశారు. ఎస్సై టి.సుధీర్‌కు అందిన విశ్వసనీయ సమాచారంతో సిబ్బందితో కలిసి సంబంధిత శిబిరాలపై దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యభిచారం చేస్తున్న 8 మంది మహిళలను, 8 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. హైవే పక్కనే కొంతకాలంగా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యభిచార ముఠా నిర్వహణ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఈ కార్యకలాపాలు ఎంతకాలంగా కొనసాగుతున్నాయి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement