Anakapalli: కొణతాలతో కలిసి పనిచేస్తానన్నది ఒట్టి మాటేనా? | Peela Govindha vs konathala ramakrishna | Sakshi
Sakshi News home page

Anakapalli: కొణతాలతో కలిసి పనిచేస్తానన్నది ఒట్టి మాటేనా?

Mar 5 2024 2:11 PM | Updated on Mar 5 2024 2:12 PM

Peela Govindha vs konathala ramakrishna - Sakshi

అనుచరులతో పూజలు, టికెట్‌ కేటాయించాలన్న డిమాండ్లు 


కొణతాలతో కలిసి పనిచేస్తానన్నది ఒట్టి మాటేనా? 


అనకాపల్లి సీటు పీలా గోవిందకేనని అనుచరుల డిమాండ్‌ 


 జనసేనకు మద్దతిచ్చేది లేదంటున్న టీడీపీ దిగువస్థాయి శ్రేణులు  

అనకాపల్లి: ముందు భగ్గుమన్నారు.. కొణతాల భేటీతో సర్దుకున్నారు.. కలిసి పనిచేస్తామని చెప్పారు.. కానీ చాప కింద నీరులా తన వర్గీయులతో పూజలు, నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తీరు అంతుబట్టడం లేదని టీడీపీ–జనసేన శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నారు. అనకాపల్లి అసెంబ్లీ టికెట్‌ జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణకు ప్రకటించడంతో టీడీపీ నేతలు.. ముఖ్యంగా పీలా వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోయారు. తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. పార్టీని వీడాలన్న డిమాండ్‌ కూడా గట్టిగా వినిపించింది.

పుండు మీద కారం జల్లినట్టు.. కొణతాల పీలా గోవిందును కలిసి మద్దతు కోరడం అటుంచి తన వద్దకు రమ్మని కబురు చేశారు. దీంతో గోవిందు వర్గీయులు కోపంతో రగిలిపోయారు. ఇంతలో కొణతాల గోవిందు వద్దకు వచ్చి కలవడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనిపించింది. ఇంతలో పీలా అనుచరులు గోవిందకే టికెట్‌ కేటాయించాలన్న డిమాండ్‌ను మళ్లీ బయటకు తీశారు. దిబ్బపాలెం రామాలయంలో కు టికెట్‌ రావాలని పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టారు. వేటజంగాలపాలెంలో పడమటమ్మ తల్లిని కూడా దర్శించుకొని పూజలు జరిపారు.

దీని భావమేమి తిరుమలేశా.. అంటూ జనసేన శ్రేణులు జుత్తు పీక్కుంటున్నారు. ఒకవైపు కలుస్తున్నట్టు కనిపిస్తూ.. మరోవైపు ఈ బిల్డప్‌లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పీలా గోవిందుకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని మధనపడుతున్నారు. ఎందుకీ డబుల్‌ గేమ్‌ అని నిలదీస్తున్నారు. టీడీపీ సహకారం లేకపోతే కనీసం పరువు నిలిచే స్థాయిలోనైనా ఓట్ల రాలవన్న భయం వారికి పట్టుకుంది. చివరకు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement