అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ సాయి చందన కంపెనీ ప్రొడక్షన్ యూనిట్ బ్లాక్–2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో కెమికల్స్ ఉండటంతో మంటలు క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చి భారీగా ఎగిసిపడ్డాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు ఫార్మాసిటీ యాజమాన్యం, ఇటు జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


